»   » మైండ్ బ్లోయింగ్.. రాంచరణ్ ఫోజులో అల్లు అర్జున్ కొడుకు, చిట్టిబాబులా అదరగొట్టాడు!

మైండ్ బ్లోయింగ్.. రాంచరణ్ ఫోజులో అల్లు అర్జున్ కొడుకు, చిట్టిబాబులా అదరగొట్టాడు!

Subscribe to Filmibeat Telugu
Allu Ayaan As Chittibabu, Pic Goes viral

రంగస్థలం చిత్రంపై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ట్రైలర్, పాటలు అన్ని ఆకట్టుకునేలా ఉండడంతో సినీ అభిమానులంతా రంగస్థలం చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జోరుగా సాగుతున్నాయి. రంగస్థలం చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. రంగస్థలం ఫస్ట్ లుక్ అందరిని ఆశ్చర్యపరిచింది. రాంచరణ్ మునుపెన్నడూ కనిపించని గెటప్ లో దర్శనం ఇవ్వడంతో చరణ్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ చరణ్ మామ ఫోజులో నిలబడి అబ్బురపరిచారు.ఎంతో క్యూట్ గా ఉన్న అయాన్ చిట్టిబాబు ఫోజు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

అందరి చూపు చిట్టిబాబుపైనే

అందరి చూపు చిట్టిబాబుపైనే

రాంచరణ్ రంగస్థలం చిత్రంలో వినికిడి లోపం ఉన్న యువకుడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ పాత్రలో చరణ్ ఎలా నటించాడనే ఆసక్తి అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

రామలక్ష్మిగా సమంత

రామలక్ష్మిగా సమంత

రంగస్థలం చిత్రంలో సమంత కూడా ప్రధాన ఆకర్షణ. సమంత పాత్రకు కూడా మంచి నటనకు ప్రాధాన్యత ఉందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 1985 నాటి పరిస్థితులకు అనుగుణంగా సమంత, చరణ్ మధ్య రొమాన్స్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు

జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు

రంగస్థలం చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవలే ఉగాది రోజున వైజాగ్ లో వైభవంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్

ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్

రంగస్థలం చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు సుకుమార్ చిత్రాన్ని ఆధ్యంతం ఆసక్తికరంగా నడిపించినట్లు అప్పుడే అంతా ఓ అంచనాకు వచ్చేస్తున్నారు. 1985 నాటి లోకల్ రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తోంది.

సంగీతం అదుర్స్

సంగీతం అదుర్స్

రంగస్థలం చిత్రానికి మరో ప్లస్ పాయింట్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పటికే అభిమానులని ఈ చిత్ర పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. చంద్రబోస్ సాహిత్యం అందించిన ప్రతి పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది.

చిట్టిబాబు గెటప్ లో అల్లు అయాన్

చిట్టిబాబు గెటప్ లో అల్లు అయాన్

అల్లు అర్జున్ తనయుడు అయాన్ చిన్న వయసులోనే సినిమాలకు పెద్ద అభిమానిగా మారుతున్నాడేమో. రంగస్థలం చిత్ర ఫస్ట్ లుక్ అందరిని ఆకట్టుకుంది. రాంచరణ్ చిట్టిబాబు గెటప్ లో ఉన్న అయాన్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బన్నీ ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

చరణ్ మామకు పెద్ద అభిమాని

చరణ్ మామకు పెద్ద అభిమాని

అయాన్.. చరణ్ మామకు పెద్ద అభిమాని అని బన్నీ ఈ ఫొటోకు కామెంట్ పెట్టాడు. అయాన్ ఫోజు మెగా అభిమానులని తెగ ఆకట్టుకుంటోంది.

English summary
Allu Ayaan as Chittibabu. Pic goes viral in social media
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X