అల్లు అయాన్ బర్త్ డే: తాతయ్య నుంచి ఊహించని గిఫ్ట్.. షాక్‌లో బన్నీ!
Recommended Video

సాధారణంగా చిన్న పిల్లల బర్త్ డే అంటే వారికి ఇష్టమైన బొమ్మలో లేక ఏదైనా ఖరీదైన బహుబతి లాంటివి ఇస్తుంటారు. అయితే అల్లు అర్జున్ కుమారుడు అయాన్ మాత్ర తాతయ్య అరవింద్ నుంచి ఊహించని గిఫ్ట్ పొందాడు. తన 5వ పుట్టినరోజున ఏకంగా ఓ స్విమ్మింగ్‌పూల్‌ను గిఫ్టుగా అందుకున్నాడు.
అల్లు అర్జున్, స్నేహారెడ్డి దంపతుల మొదటి సంతానమైన అల్లు అయాన్ ఏప్రిల్ 3, 2014లో జన్మించాడు. నేటితో ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న అయాన్‌కు బన్నీ అభిమానుల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది.

గిఫ్ట్ చూసి ఇంకా షాక్‌లో ఉన్న బన్నీ
‘మా నాన్న అయాన్ పుట్టినరోజు సందర్భంగా స్విమ్మింగ్‌పూల్ గిఫ్టుగా ఇచ్చారు. ఇది చూసి నేను ఇంకా షాక్ లోనే ఉన్నాను. సరిగ్గా 45 రోజుల క్రితం నీకు బర్త్ డే గిఫ్ట్ ఏం కావాలని అడిగితే... స్విమ్మింగ్ పూల్ కావాలని అయాన్ చెప్పాడు. ఆయన వెంటనే ఒకే చెప్పేసి అయాన్ కోరిక తీర్చాడు' అని అల్లు అర్జున్ తెలిపారు.

అయాన్ చాలా అదృష్ట వంతుడు, నాకు అసూయగా ఉంది
‘ఇలా ఏది అడిగితే అది బహుమతిగా ఇచ్చే తాతయ్య దొరకడం అయాన్ అదృష్టం. మా ఫ్యామిలీలో ఈ 4వ జనరేషన్ పిల్లలు చాలా లక్కీ. వీరిని చూస్తే నాకు అసూయ వేస్తోంది. దీనికి మేము ‘అల్లు పూల్' అని పేరు పెట్టాం' అని బన్నీ చెప్పుకొచ్చారు.

పుట్టినరోజు ఫోటోలు షేర్ చేసిన స్నేహారెడ్డి
ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ పైగా ఫాలోవర్స్ కలిగిన అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తన కుమారుడికి సంబంధించిన పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్
గతేడాది విడుదలైన ‘నా పేరు సూర్య' మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ తన పూర్తి సమయాన్ని భార్య పిల్లలతోనే గడుపుతున్నారు. ఆయన తన తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో కమిటైన సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో అల్లు అర్జున్ బర్త్ డే(ఏప్రిల్ 8) సెలబ్రేషన్స్ జరుగబోతున్నాయి. ఆ తర్వాత త్రివిక్రమ్ మూవీ షూటింగులో బిజీ కాబోతున్నాడు.


Click it and Unblock the Notifications











