వైరల్ పిక్: సంచలనాలు మొదలు పెట్టిన బన్నీ కొడుకు.. మెగా ఫ్యామిలీ నుంచి మూడో ధీరుడు!
Recommended Video

మెగా ఫ్యామిలిలో వరుసగా వారసులు రెడీ అవుతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ తరువాత ప్రస్తుతం బన్నీ, రాంచరణ్ రెండవ తరం నటుల హవా కొనసాగుతోంది. చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ అందరిచూపు బన్నీ, చరణ్, వరుణ్, తేజ్ పైనే ఉంది. మూడవ తరం హీరోలుకూడా రెడీ అయిపోతున్నారు. ఓ వైపు పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతుంటే, బన్నీ తనయుడు అయాన్ కూడా సంచలనాలు మొదలు పెట్టాడు. అల్లు అయాన్ హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హార్స్ రైడింగ్ పిక్ హల్ చల్
అల్లు అయాన్ కు బన్నీ హార్స్ రైడింగ్ నైపుణ్యాన్ని బాగా నేర్పించబోతున్నట్లు తెలుస్తోంది. అయాన్ గుర్రమెక్కి మెళుకువలు నేర్చుకుంటున్న పిక్ వైరల్ గా మారింది. మెగా ఫ్యామిలిలో మూడవ ధీరుడు అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అన్ని విన్యాసాలు చేసిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో చేయని విన్యాసం అంటూ లేదు. కేవలం డాన్సులు, నటన మాత్రమే కాదు దేనికి బెదరకుండా రిస్కీ షాట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక గుర్రపు స్వారిలో కూడా చిరుకు మంచి నైపుణ్యం ఉంది.

మగధీరతో అదరగొట్టిన రాంచరణ్
మగధీర చిత్రంలో రాంచరణ్ హార్స్ రైడింగ్ నైపుణ్యంతో అదరగొట్టాడు. చిన్నప్పటి నుంచి క్రమం తప్పకుండా గుర్రపు స్వారీ నేర్చుకోవడం వలనే అది సాధ్యం అయింది.

ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత
మెగా హీరోల్లో ఒక్కొక్కరికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అదే విధంగా అయాన్ కు కూడా గుర్రపు స్వారీ లాంటి నైపుణ్యం ఉండాలని బన్నీ భావిస్తున్నాడు. పాలబుగ్గలతో ఉన్న అయాన్ గుర్రం మీద కూర్చుని ఉన్న ఫోటో ఆకట్టుకుంటోంది.


Click it and Unblock the Notifications











