»   » స్వాతంత్ర్య వేడుకల్లో అల్లు అర్జున్ కొడుకు అయాన్ (ఫోటోస్)

స్వాతంత్ర్య వేడుకల్లో అల్లు అర్జున్ కొడుకు అయాన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొడుకు అయాన్ కూడా సందడి చేసారు. గీతాఆర్ట్స్ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అల్లు అరవింద్ తన మనవడు అయాన్ ను కూడా తీసుకొచ్చారు. బుడి డుడి అడుగులు వేస్తూ అయాన్ జెండా వందనం చేయడం ఆకట్టుకుంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లక్కేయండి.

Allu Ayaan independence day celebration

తండ్రి టాలీవుడ్లో పెద్ద స్టార్ కావడంతో అయాన్ పుట్టిన వెంటనే సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. వివిధ అకేషన్లలో అల్లు అర్జున్ తన కొడుకు తో ప్రత్యేకంగా ఫోటో షూట్ నిర్వహించి ఆ ఫోటోలు విడుదల చేయడంతో అయాన్ కూడా అభిమానుల్లో తనకంటూ ప్రత్యేకంగా ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు.


Allu Ayaan independence day celebration

ఆ మధ్య అయాన్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఈ ఫోటోను పోస్టు చేసింది మరెవరో కాదు...అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి. అయాన్ అద్దం ముందు నిల్చొని డాన్స్ చేస్తున్నాడు. వెంటనే స్నేహారెడ్డి ఈ ఫోటో క్లిక్ మనిపించారు. అయాన్ ఊపు చూస్తుంటే భవిష్యత్తులో తండ్రిని మించిన డాన్సర్ అవుతాడని అంటున్నారు.

English summary
Allu Ayaan independence day celebration.
Please Wait while comments are loading...