Don't Miss!
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్‌ఫోన్..!!
అందరి ముందు అల్లు అర్జున్ను ఇరికించే ప్రయత్నం.. సమంతతో అయాన్ భారీ ప్లాన్
సమంత ప్రస్తుతం ఆహా యాప్‌లో దూసుకుపోతోంది. సామ్ జామ్ అంటూ సెలెబ్రిటీలతో మాటా మంతి చేస్తోన్న సమంత.. ఎన్నో విషయాలను బయటకు తీసుకొస్తోంది. స్టార్స్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన విషయాలను బయట పెట్టిస్తూనే.. సామాజిక కార్యక్రమాలు, సేవలు చేసే వారి గురించి అందరికీ తెలిసేలా చేస్తోంది. మొత్తానికి సామ్ జామ్ మొదటి సీజన్ ముగిసేందుకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే తారలు సమంతతో బాగానే ముచ్చట్లు పెట్టారు.
మొదటి ఎపిసోడ్ అలా..
టాలీవుడ్ సెన్సేషన్ యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండతో మొదటి ఎపిసోడ్‌ను సమంత ఎంతో చలాకీగా నిర్వహించింది. ఆ తరువాత రానా, నాగ్ అశ్విన్, క్రిష్ , రకుల్, తమన్నా ఇలా అందరినీ ఇంటర్వ్యూ చేసింది. పైగా స్పోర్ట్స్ పర్సనాలిటీ సైనా నెహ్వాల్‌ను కూడా సమంత ఇంటర్వ్యూ చేసేసింది.
మెగా ఎపిసోడ్..
సమంత చిరంజీవితో చేసిన ఇంటర్వ్యూ కోసం ఎంతో మంది ఎదురుచూశారు. మెగా ఎపిసోడ్‌ను ఆహా వారు కూడా ఎంతో ప్రమోట్ చేశారు. ప్రోమోలతో ఆసక్తిని పెంచేశారు. మొత్తానికి క్రిస్మస్ కానుకగా ఆహాలో చిరు ఎపిసోడ్‌ను అందుబాటులో ఉంచారు. సమంతతో చిరు ముచ్చటించిప్రతీ మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
ఇప్పుడు బన్నీ వంతు..
ఇక చిరంజీవి ఎపిసోడ్ అయిందో లేదో అల్లు అర్జున్‌తో చేసిన ఎపిసోడ్‌ను ప్రమోట్ చేసే పనిలో పడింది ఆహా టీం. న్యూ ఇయర్ స్పెషల్‌గా ఈ ఎపిసోడ్‌ను రిలీజ్ చేయబోతోన్నట్టు ఇదివరకు ప్రకటించారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు.
అల్లు అయాన్ స్పెషల్ కాల్..
అల్లు అర్జున్ సమంత షోలో పాల్గొంటున్నాడని తెలుసుకున్న అయాన్.. తన తండ్రిని ఇరికించే ప్రయత్నం చేశాడు. మా నాన్నను మీరు ఇంటర్వ్యూ చేయబోతోన్నారట కదా.. ఓ ప్రశ్న అడగండి అంటూ అయాన్ బన్నీని బుక్ చేసేందుకు సమంతతో చేతులు కలిపాడు. మరి ఇంతకీ ఆ ప్రశ్న ఏంటో మాత్రం రివీల్ చేయలేదు. అది తెలియాలంటే మాత్రం ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చే వరకు ఎదురుచూడాల్సిందే.