Allu Arjunపై పోలీసులకు అల్లు అయాన్ కంప్లైంట్‌కు రెడీ .. అంతలా గొడవ ఏం జరిగిందంటే?

గంగోత్రి సినిమాతో మెగా కాంపౌండ్ హీరోగా అడుగుపెట్టి... ఐకానిక్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. ప్రతి సినిమాకు కొత్తదనం, నటనా పరంగా అభివృద్ధి చూపుతూ.. పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రస్తుతం పుష్ప 2 చిత్రంతో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్.. ఆయన కొడుకు గురించి చెప్పుకువచ్చిన ఓ వీడియో వైరల్ గా మారింది. తనపై అల్లు అయాన్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చేందుకు రెడీ అయ్యారట. అంతలా వీరి మధ్య ఏం గొడవలు జరిగాయో ఈ స్టోరీలో చూసేద్దాం పదండి.

గ్లోబర్ స్టార్...:అల్లు అర్జున్.. పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. గ్లోబల్ వైడ్ గా గుర్తింపు అయితే లభించింది. అంతే కాదు.. పుష్ప సినిమాకు గానూ జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక బన్నీ తండ్రి అల్లు అరవింద్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరనే విషయం తెలిసిందే. ఇక అల్లు అర్జున్ తాను ప్రేమించిన స్నేహరెడ్డిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీలైఫ్ గడిపేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఒకరు అల్లు అయాన్, మరొకరు అల్లు అర్హ.

Allu Ayan is ready to file a police complaint against Allu Arjun Video Goes Viral

అర్హ స్టార్ కిడ్...:అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇప్పటికే సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సమంతతో కలిసి శాకుంతలం సినిమాలో భరతుడిగా కనిపించింది. ఇప్పటికే అల్లు అర్హ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ స్టార్ కిడ్‌ అయింది. ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందనే చెప్పాలి. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ కూడా హైపర్ యాక్టివ్. ఒక్క సినిమాలో నటించకపోయినా.. ఫుల్ పాపులారిటీ అయితే ఉంది.

అయాన్ డిఫరెంట్...:కరోనా టైంలో అల్లు ఫ్యామిలీ మొత్తం చప్పట్లు కొడుతుంటే.. అల్లు అయాన్ మాత్రం డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. ఆ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు అయాన్ ఫన్నీ వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్ అవుతున్నాయి. మొన్నటికి మొన్న కుర్తి మెడలో వేసుకుని అల్లు మోడల్ అంటూ కనిపించాడు. అయితే ఈ క్రమంలోనే అల్లు అయాన్ సినీ ఇండస్ట్రీ ఉంటుందని ప్రచారం జరుగుతుంది. పుష్ప 2తోనే అల్లు అయాన్ ఎంట్రీ అని వార్తలు వస్తున్నాయి.

అయాన్ గురించి బయటపెట్టిన బన్నీ:ఆ విషయం పక్కన పెడితే.. అల్లు అయాన్ గురించి అల్లు అర్జున్ మాట్లాడిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆహాలో సామ్ జామ్ ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిన సంగతి తెలిసిందే. దానికి హోస్టుగా సమంత ఉండగా.. గెస్టులుగా అల్లు అర్జున్, అల్లు అరవింద్ వచ్చారు. ఇక ఈ క్రమంలోనే అల్లు అయాన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అల్లు అర్జున్ బయటపెట్టాడు.

బన్నీపై కంప్లైంట్...:అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ఏదో కోపంలో అయాన్ పడాతాయి అంటే... నువ్వు నన్ను కొట్టాలని చూస్తున్నావా... నీకు తెలుసా అమెరికాలో పిల్లలనుకొడితే.. పోలీసులకు కాల్ చేస్తారని అని అల్లు అయాన్ చెప్పినట్లు బన్నీ చెప్పుకువచ్చాడు. దాంతో నాయన నేనొదో చెయ్యి ఎత్తాను అంతే అని చెప్పినట్లు అర్జున్ తెలిపాడు. దీంతో అక్కడ ఉన్న సమంత, అల్లు అరవింద్ కూడా నవ్వారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X