అన్న పెళ్లికి అల్లు అర్జున్ గైహాజరు.. అసలు విషయం చెప్పేసిన అల్లు బాబీ
Recommended Video
ఇటీవలే అల్లు అర్జున్ సోదరుడు, అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యమైన కుటుంబ సభ్యులు, అతి సన్నిహితులు మాత్రమే హాజరైన ఈ పెళ్ళిలో అల్లు అర్జున్ కనిపించక పోవడంతో చర్చలు ఊపందుకున్నాయి. ఈ విషయమై మీడియాలో చిత్ర విచిత్రమైన కథనాలు పుట్టుకొచ్చాయి. దీంతో తాజాగా దీనిపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు అల్లు బాబీ. వివరాల్లోకి పోతే..

నీలూ షాతో అల్లువారబ్బాయి రెండో పెళ్లి
మొదటి భార్యతో విడాకులు తీసుకున్న అల్లు బాబీ.. ఇటీవలే రెండో వివాహం చేసుకున్నాడు. నీలూ షా అనే యువతిని పెళ్లాడాడు. అప్పటిదాకా అల్లు అర్జున్‌కి అన్నయ్య ఉన్నాడనే సంగతే తెలియని ప్రేక్షకులు ఆయన రెండో పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో రావడం చూసి షాక్ అయ్యారు. వెంటనే ఈ పెళ్లి వేడుకలో అల్లు అర్జున్ ఎక్కడ? అని వెతకడం ప్రారంభించారు. కానీ ఏ ఒక్క ఫోటోలోనూ అల్లు అర్జున్ కనిపించలేదు.

అదంతా అవాస్తవం
అల్లు బాబీ పెళ్లి ఫొటోల్లో అల్లు అర్జున్ కనిపించక పోవడంతో.. అన్నయ్య రెండో పెళ్లిలో బన్నీ లేడని, అందుకు కారణాలు ఇవే అని రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ గమనించిన అల్లు బాబీ తాజాగా వీటిపై స్పందించాడు. తన వివాహంలో తమ్ముడు లేడని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన పేర్కొన్నాడు.

ఇదీ అసలు విషయం
తాను పోస్ట్ చేస్తున్న పెళ్లి ఫొటోలు తీసిందే అల్లు అర్జున్ అని, అలాంటపుడు అతను ఫొటోల్లో ఎలా కనిపిస్తాడని తెలిపి ఆశ్చర్యపర్చాడు అల్లు బాబీ. మరి కొద్దీ రోజుల్లో తన రెండో పెళ్లి తాలూకు వీడియో కూడా సోషల్ మీడియాలో పెడతానని, అప్పుడు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో మీకే తెలుస్తుందని అన్నాడు అల్లు బాబీ. ఈ రకంగా అల్లు అర్జున్ గైహాజరు అనే వార్తలపై ఆసక్తికర క్లారిటీ ఇచ్చాడు బాబీ.

అందరి అంగీకారంతోనే జరిగింది
నీలిమ అనే యువతితో అల్లు బాబీకి 2005 లో మొదటి వివాహం జరిగింది. వీరిద్దరికీ పదేళ్ల పాప కూడా ఉంది. అయితే వ్యక్తిగత అభిప్రాయభేదాల కారణంగా పరస్పర అంగీకారంతో ఇటీవలే ఈ ఇద్దరూ విడిపోయారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులందరి అంగీకారంతోనే తాను రెండో వివాహం చేసుకున్నానని ప్రకటించాడు అల్లు బాబీ.


Click it and Unblock the Notifications











