అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు మ్యారేజ్ రిసెప్షన్ ఎప్పుడంటే..
అల్లు అర్జున్ వివాహం స్నేహారెడ్డితో మార్చి 6న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వచ్చేనెల 8న అభిమానుల కోసం ప్రత్యేకంగా రిసెప్షన్‌ను అల్లు అరవింద్ కుటుంబం ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరుగనున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్త అభిమానులు పాల్గొననున్నారు. వీరికోసం ప్రత్యేకంగా మధ్యాహ్న విందును ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ పంక్షన్ ఎరేంజ్ మెంట్స్ లో ఇరువైపుల కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారన్నారు. పెళ్ళి సూటు కోసం డిల్లీనుంచి ప్రత్యేకంగా డిజైనర్ వస్తున్నారని అన్నారు. ఇక తనది ప్రేమ వివాహం అని మీడియాలో వచ్చిందని, అయితే అది నిజం కాదని, ఓ పార్టీలో తాము ఇద్దరం పరిచయం అయ్యామని, ఆ తర్వాత తమ అభిరుచులు కలవటంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పటం వారు నిశ్చితార్దం ఏర్పాటు చేయటం జరిగిందని అని చెప్పుకొచ్చారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.


Click it and Unblock the Notifications











