అల్లు హీరో సినిమాకు ముహూర్తం ఖరారు, ఆ ఇద్దరు నిర్మాతలు నిర్మిస్తున్నారు!

ఒక్క క్షణం సినిమా విడుదల తరువాత అల్లు శిరీష్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. మలయాళ సినిమాని రీమేక్ చేయడానికి సిద్ధమయ్యాడు ఈ హీరో. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి (అమెరి బోర్న్డ్ కన్ఫ్యూజ్డ్ దేశి) సినిమాను అల్లు శిరీష్ రీమేక్ చెయ్యబోతున్నాడు. నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు.

జూన్‌నుండి షూటింగ్ మొదలుకాబోతున్న ఈ సినిమా మే 30న ముహూర్తం జరుపుకోనుంది. ఇందులో అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనేదే ఈ సినిమా కథ. కథ మొత్తం హీరో పాత్ర జర్నీ మీదే నడుస్తుంటుంది. అల్లు శిరీష్ కు ఇది కొత్త పాత్ర, అదే విధంగా బాగా సెట్ అయ్యే పాత్ర.

Allu hero film gets a launch date, that two producers producing

నిర్మాత మధుర శ్రీధర్, యష్ రంగినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో అల్లు శిరీష్ విజయం సాధించాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X