జన్మజన్మల కథ.. ఒక్క క్షణం.. అల్లు శిరీష్
Recommended Video

నేను అందరిలా చెప్పట్లేదు...!
వీఐ ఆనంద్ దర్శకత్వంలో అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ఒక్క క్షణం. ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో వీఐ ఆనంద్ సక్సెస్‌ను సొంతం చేసుకొన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టిజర్ ఆదివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్, సురభి, సీరత్ కపూర్, చోట కే ప్రసాద్, రచయిత అబ్బూరి రవి హాజరయ్యారు.
ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఈ కథ చాలా కొత్త పాయింట్. గత జన్మలకు ఈ జన్మకు లింక్ చేస్తూ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ నేపథ్యంగా సినిమా సాగుతుంది. కానీ అందరికి నచ్చేవిధంగా మంచి పాటలు, ఫైట్స్ ఉంటాయి. ఈ సినిమా చాలా ఖర్చుతో భారీగా రూపొందిస్తున్నాం. తప్పకుండా అందరికి నచ్చుతుంది అని అన్నారు.



Click it and Unblock the Notifications











