twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అల్లు శిరీష్ ‘గౌరవం’ స్టోరీ లైన్

    By Srikanya
    |

    హైదరాబాద్: అల్లు శిరీష్‌ హీరోగా 'గౌరవం' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్న ఈ చిత్రం కథ గురించి అల్లు శిరీష్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... ఇదో సోషల్ డ్రామా... హ్యూమన్ టచ్ తో కూడి ఉంటుంది. ఓ సిటీ కుర్రాడు... తన స్నేహితుడుని వెతుక్కుంటూ ఓ విలేజ్ కు వెళ్లతాడు. అక్కడ అసలు భారతీయ గ్రామం స్వరూపం చూడటం జరుగుతుంది. అక్కడ జరిగే పరిణామాల సమాహారమే మా చిత్రం అన్నారు.

    ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి కానుకగా విడుదల చేసారు. అళగియ దీయే, మొళి, అభియుమ్ నానుమ్, పయనం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాధామోహన్ తాజాగా రూపకల్పన చేస్తున్న చిత్రం గౌరవం. నటుడు ప్రకాష్‌రాజ్ డ్యూయెట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో తెరకెక్కుతోంది.

    ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రెండవ కొడుకు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్' లోనూ హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం...ఈ చిత్రంలో మెగా అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి అని దర్శకుడు చెప్తున్నారు.

    ప్రేమ, సెంటిమెంట్, వినోదం కలిసిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని నవ హీరో అల్లు శిరీష్ అంటున్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయాన్ని ఇస్తుందని అల్లు శిరీష్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

    English summary
    Allu Sirish about Gauravam film. He says... It's a social drama with a human touch. It is not exactly about honour killing as it is being reported. I am a city boy,who goes to a village in search of my friend and sees the state of rural India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X