twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏంటి అల్లు శిరీష్ డిప్రెషన్‌లోకి వెళ్లాడా?.. ఆ డైరెక్టర్‌ను అలా అడుక్కునే వాడట!

    |

    ఒక్కో హీరోకు ఒక్కో చిత్రం స్పెషల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఆ సినిమాను తెరకెక్కించే క్రమంలో దర్శకుడికి, హీరోకు మంచి స్నేహబంధం కూడా ఏర్పడుతుంది. ఆ సినిమాతో పాటే వారి ప్రయాణం కూడా సాగుతూ ఉంటుంది. పైగా తన హీరోకు ఉన్న కష్టాలను దూరం చేస్తూ నిత్యం వెన్నంటి ఉండే దర్శకుడు ఉంటే ఇంకేం కావాలి. అందుకు అల్లు శిరీష్.. తన డైరెక్టర్ పరుశురాంపై అనంతమైన ప్రేమను కురిపిస్తున్నాడు. వీరి కాంబోలో వచ్చిన శ్రీ రస్తు శుభమస్తు చిత్రానికి నాలుగేళ్లు పూర్తి కావడంతో అల్లు శిరీష్ ఎమోషనల్ అయ్యాడు.

    అది కష్టకాలం

    అది కష్టకాలం

    ‘హిట్స్ ఫ్లాప్స్ వస్తుంటాయి పోతుంటాయి. ప్రతీ ఒక్కరికీ ఓ చిత్రం మాత్రం కచ్చితంగా ఉంటుంది. అదే అన్నింటికి పరిష్కారంగా మారుతుంది. నా జీవితంలో శ్రీరస్తు శుభమస్తు చిత్రం కూడా అలాంటి పాత్రనే పోషించింది. నా పర్సనల్ లైఫ్‌ను కష్టంగా ఈదుతున్న సమయం అది. ఒంటరిగా ఉండకూడదని లేదా ఇంటికి వెళ్లే గ్యాప్ కూడా ఇవ్వకుండా షూట్ చేయమని డైరెక్టర్ బుజ్జి (పరుశురామ్)ను అడుక్కునే వాడిని.

    బ్రదర్, మెంటర్..

    బ్రదర్, మెంటర్..

    ఆ సమయంలోనే నన్ను జాగ్రత్తగా చూసుకునే బ్రదర్ లాంటి ఓ డైరెక్టర్ దొరికాడు. నాకు నటనను నేర్పాడు. తప్పొప్పులను సరిదిద్దాడు. నా ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకునే ఓ ఫ్రెండ్‌లా మారిపోయాడు. ఒక్కసారి సెట్‌పైకి వస్తే నా మైండ్‌లో ఉన్నదంతా మరిచిపోయేవాడిని. మేము సినిమా కోసం కలిసి పని చేస్తున్నామనేది కూడా మరిచిపోయే వాళ్లం.

    రియల్ లైఫ్ క్యారెక్టర్..

    రియల్ లైఫ్ క్యారెక్టర్..

    మేము కలిసి నవ్వుకునేవాళ్లం, ప్రయాణించేవాళ్లం, కలిసే తినేవాళ్లం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కూడా శిరీష్ కావడంతో అంతా ఈజీగానే అయింది. నా నిజ జీవిత పాత్రనే నేను పోషిస్తున్నాన్న భ్రమ కలిగేది. హైద్రాబాద్, వైజాగ్, కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం.

    అందరికీ థ్యాంక్స్..

    అందరికీ థ్యాంక్స్..

    లావణ్య, రావు రమేష్, ప్రకాష్ రాజ్ సర్, సుబ్బరాజు, అలీ గారు, హంసా నందిని, తణికెళ్ల భరణి గారు ఇలా ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. డీఓపీ మణికందన్, తమన్, ఇంద్రాక్షి, అసిస్టెంట్ డైరెక్టర్లందరికీ ధన్యావాదాలు.

    Recommended Video

    Celebrities Green India Challenge
    బ్రేక్ ఇచ్చాడు..

    బ్రేక్ ఇచ్చాడు..

    ఈ సినిమాతో నాకు బ్రేక్ ఇచ్చినందుకు పరుశురామ్‌కు ఎల్లప్పుడు కృతజ్ఞుడినే. ఈ చిత్రం వచ్చి నాలుగేళ్లు అవుతుందంటే నమ్మలేకపోతున్నా. శ్రీరస్తు శుభమస్తు లాంటి ఎన్నో మూమెంట్స్ నా జీవితంలోకి రావాలని కోరుకుంటున్నాను. ఈ మూవీపై మీ ప్రేమను కురిపించినందుకు థ్యాంక్స్. స్వీట్ మెమోరీస్' అంటూ అల్లు శిరీష్ ఎమోషనల్ అయ్యాడు.

    English summary
    Allu Sirish Emotional On Srirastu Subhamastu Completes 4 years. Hits & flops come and go. But then there will always be that one film that's memorable in every way. For me that film was Srirastu Subhamastu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X