హీరోలు గొప్ప కాదంటున్న అల్లు శిరీష్
ఇప్పటికే హాలీవుడ్, బాలీవుడ్లలో ఈ ట్రెండ్ కొనసాగుతోందని చెబుతూ....... హాలీవుడ్ హీరో టాప్ క్రూయిజ్ నటించిన 'మిషన్ ఇంపాజబుల్' చిత్రం 47 మిలియన్ డాలర్ల ఓపెనింగ్స్ సాధిస్తే, ఆయన నటించిన మరో సినిమా 'రాక్ ఆఫ్ ఏజెస్' కేవలం 14 మిలియన్ డాలర్లు మాత్రమే వసూలు చేసిందని, అదే విధంగా బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ నటించిన రౌడీ రాథోడ్ చిత్రం రూ. 48 కోట్ల ఓపెనింగ్స్ సాధిస్తే...ఆయన నటించిన జోకర్ చిత్రం మాత్రం కేవలం రూ. 15 కోట్లు మాత్రమే సాధించిందని గుర్తు చేసాడు.
ఫ్రాంచైజీ చిత్రాలు (రాజ్, మర్డర్, ధూమ్), హై కాన్సెప్ట్ సినిమాలు వికీ డోనర్, వెన్స్ డే చిత్రాలు స్టార్లతో సంబంధం లేకుండా నడిచాయని శిరీష్ అంటున్నారు. ఈ లెక్క ప్రకారం టాలీవుడ్లో కూడా రాబోయే కాలం ఇలానే ఉంటుందని అభిప్రాయ పడుతున్నాడు. అయితే అల్లు శిరీష్ అభిప్రాయంతో టాలీవుడ్ టాప్ హీరోల వీరాభిమానులు మాత్రం ఏకీభవించడం లేదు. పని పాట లేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఎప్పుడైనా స్టార్లే గొప్పవారని..అతను అల్లు శిరీష్ కాదు సొల్లు శిరీష్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇక శిరీష్ గౌరవం సినిమా విసయానికొస్తే ఈ చిత్రం తాజాగా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. యామి గౌతమ్ హీరోయిన్. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications












