పిడిగుద్దులతో రెచ్చిపోయిన బుడ్డోడు.. తన్నులు తిన్న అల్లు శిరీష్
అల్లు శిరీష్ ప్రస్తుతం ఏ సినిమాను కమిట్ అయినట్టు లేడు. చివరగా మళయాల రీమేక్ ఏబీసీడీతో పలకరించాడు. ఆ చిత్రం పర్వాలేదనిపించగా.. ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. అయితే మరో చిత్రాన్ని మాత్రం పట్టాలెక్కించలేదు అల్లు వారబ్బాయి. తాజాగా అల్లు శిరీష్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
మొదటి నుంచి ఓ ధీటైన విజయాన్ని అందుకుని నిలబడాలనుకుంటోన్న అల్లు శిరీష్‌కు ప్రతీసారి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మెగా ఫ్యామిలీ అండ, అల్లు అరవింద్ లాంటి అనుభజ్ఞులు ఉన్నా కూడా శిరీష్ కెరీర్‌ను గాడిలో పెట్టుకోలేకపోతున్నాడు. మెగా హీరోల్లో అందరూ స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తోన్నా.. శిరీష్ మాత్రం మీడియం రేంజ్ హీరోగా కూడా ఫ్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. అయితే ఈ హీరో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటాడు.

తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన అల్లు శిరీష్.. ఓ పిల్లాడి చేతిలో దెబ్బలు తింటూ కనబడ్డాడు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తోన్న శిరీష్.. తన కొత్త బాక్సింగ్ పార్టనర్ అంటూ పరిచయం చేశాడు. అయితే ఆ బుడ్డోడు మాత్రం రెచ్చిపోయి కిక్‌లు ఇస్తున్నాడు. అల్లు శిరీష్ వాటి నుంచి తప్పించుకుంటూ ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











