పవన్ సినిమాపై పూరికి అల్లు శిరీష్ రిక్వెస్ట్

By Bojja Kumar

పవన్ కళ్యాణ్‌తో పూరి జన్నాథ్ సినిమా తీస్తానని ప్రకటించగానే నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ట్విట్టర్ ద్వారా సంతోషం వ్యక్తం చేస్తూ ట్విట్టర్లో కొన్ని కామెంట్లు చేశాడు. ''ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ పై చేయాలని, సౌతిండియా మొత్తం సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే దమ్ము మా కంపెనీకి ఉంది. దీన్ని బిగ్గెస్ట్ మూవీ చేద్దాం'' అంటూ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు.

శిరీస్ వ్యాఖ్యలను బట్టి చూస్తే మా బ్యానర్ అంత పెద్ద బ్యానర్ తెలుగునాట లేదు, మీరు మాతో చేతులు కలిపితే...పవర్ స్టార్ ఇమేజ్ ను వాడుకుని సినిమాను కలెక్షన్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ చేద్దాం అని పరోక్షంగా చెప్పినట్లుంది. ఇలా చేయడం ద్వారా ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్ పేరునే ఉన్న మగధీర రికార్డు ఒక వేళ చెరిగి పోయినా...పవన్-పూరి సినిమా ద్వారా ఆ రికార్డు తమ బేనర్ పేరు మీదే ఉంటుందని ఆయన ఆలోచనగా కనిపిస్తోందని సీనీ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.

ఇక అల్లు శిరీష్ తెరంగ్రేటం విషయానికొస్తే....తమిళంలో అల్లు శిరీష్ ని గ్రాండ్ గా లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు అల్లు అరవింద్. ఈ మేరకు ప్రభాస్ హీరోగా రూపొందిన 'మిస్టర్ పర్‌ఫెక్ట్' చిత్రం రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు సమాచారం. అయితే డైరక్టర్ గా ఎవరని తీసుకోవాలనేది ఇంకా నిర్ణయించుకోలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X