స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్.. క్రేజీ మూవీ నుంచి తప్పున్న అల్లు శిరీష్, ఎమోషనల్ పోస్ట్!
అల్లువారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ తన కెరీర్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. శ్రీరస్తు శుభమస్తు చిత్రంతో మెప్పించిన అల్లు శిరీష్ హడావిడిగా సినిమాలు చేయడం లేదు. తనకు సరిపోయే చిత్రాలు ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. కాగా ఓ క్రేజీ మూవీలో నటించే అవకాశం అల్లు శిరీష్ కు వచ్చింది. స్టార్ హీరో చిత్రంలో కీలక పాత్రలో నటించే అవకాశం అది. కానీ ఆ ఆఫర్ ని శిరీష్ వదులుకున్నాడు. ఆ చిత్రం నుంచి ఎందుకు తప్పుకోవాల్సి వచ్చింది అనే విషయాన్ని శిరీష్ సోషల్ మీడియాలో వివరించాడు.
స్టార్ హీరో సూర్య, స్టార్ డైరెక్టర్ కెవి ఆనంద్ కాంబినేషన్లో ఇటీవల ఓ చిత్రం ప్రారంభమైంది. ఆ చిత్రంలో అల్లు శిరీష్ కీలక పాత్రలో నటించాల్సి ఉంది. కానీ తాను నటిస్తున్న ఎబిసిడి చిత్ర విషయంలో డేట్స్ సర్దుబాటు కాలేదు. అందువలన ఈ అద్భుత అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తోందని అల్లు శిరీష్ ట్విట్టర్ లో ఎమోషనల్ గా స్పందించాడు.

సూర్య, కెవి ఆనంద్ చిత్రం లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో భారీ స్థాయిలో రూపొందుతోంది. కెవి ఆనంద్ దర్శకత్వంలో సూర్య ఇప్పటికే వీరుడొక్కడే, బ్రదర్స్ వంటి చిత్రాల్లో నటించాడు.


Click it and Unblock the Notifications











