'దూకుడు' నిర్మాతకి అల్లు శిరిష్ ఛాలెంజ్ !?
దూకుడు చిత్రానికి సంభందించి గత కొద్ది రోజులుగా రికార్డుల సవాళ్లు, ప్రతి సవాల్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఫేస్ బుక్ లో దూకుడు నిర్మాత దూకుడు చిత్రం రికార్డులు ఫేక్ అని ప్రూవ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారని రూమర్ ప్రారంభమైంది. దాన్ని నిజమని నమ్మిన కొందరు ట్విట్టర్ లో అల్లు శిరీష్ కు పోస్ట్ చేయగా దానికి స్పందనగా... “ఆఫీసులో నోటీస్ బోర్డ్, ఫేస్ బుక్ లో పెడితే ఎవడు చూస్తాడు. డేర్ ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఛాలెంజ్ డిక్లేర్ చెయ్యమను అంటూ ట్వీట్ చేసారు. దాంతో ఈ ట్వీట్ దూకుడు నిర్మాతని ఉద్దేశించే అని ప్రచారం జరుగుతోంది. అయితే మరో ప్రక్క దూకుడు నిర్మాత తనపై వచ్చిన రూమర్ ని ఖండిస్తూ ప్రకటన చేసారు.
ఈ విషయమై అనీల్ సుంకర మాట్లాడుతూ... దూకుడు విజయంతో మా టీమ్ అంతా చాలా ఆనందంగా ఉంది. మహేష్ ప్యాన్స్, తెలుగు సినీ పరిశ్రమ కూడా ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నేను ఇప్పటికీ చెప్తున్నారు దూకుడు చిత్రం ఎనభై సంవత్సరాలు తెలుగు సిని పరిశ్రమ రికార్డులను తిరగ రాసింది. ఇప్పటికీ అదే మాటపై నిలబడి ఉన్నాను. అలాగే ఈ చిత్రం రికార్డుల విషయమై నేను ఏ విధమైన ఛాలెంజ్ లు చేయలేదు.. పబ్లిక్ స్టేట్మెంట్ లు ఇవ్వలేదు. కొంతమంది నా మాటలను వక్రీకరించి, స్పైస్ అద్ది ప్రచారం చేస్తున్నారు. మేము ఇక్కడ ఎవరి మనోభావాలను దెబ్బ తీసే ఉద్దేశ్యంలో లేము అన్నారు. మా సినిమానే ప్రతీ విషయాన్ని మాట్లాడుతుంది. ఇది ఎంజాయ్ చేసే సమయం అన్నారు.


Click it and Unblock the Notifications











