రాంచరణ్, అల్లు అర్జున్ విభేదాలు... పెదవి విప్పిన అల్లు శిరీష్... పవన్ కల్యాణ్‌ గురించి కూడా

టాలీవుడ్ మీడియాలో గత కొద్దికాలంగా మెగా హీరోల గురించి ఓ రూమర్ వైరల్ అవుతున్నది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు నెలకొన్నాయనేది గాసిప్ సారాంశం. అందుకు తగినట్టుగానే వారిద్దరూ ఈ మధ్యకాలంలో కలిసి కనిపించకపోవడంతో నిజమేనా అనే అనుమానం తలెత్తింది. అలాగే రంగస్థలం సినిమాపై అల్లు అర్జున్ కామెంట్ చేయకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. అయితే తాజాగా అల్లు శిరీష్ వారి మధ్య విభేదాలపై క్లారిటీ ఇచ్చారు. ఏబీసీడీ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ...

 ఆ వార్తల్లో వాస్తవం..

ఆ వార్తల్లో వాస్తవం..

అల్లు అర్జున్, రాంచరణ్‌ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఇద్దరు హీరోలు రెగ్యులర్‌గా కలుసుకొంటారు. చాలా విషయాలపై మాట్లాడుకొంటారు. అలాంటి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తల్లో వాస్తవం లేదు. స్టైలిష్ స్టార్, మెగా పవర్ స్టార్ మాట్లాడుకోవడం లేదనే వార్తలో అర్థం లేదు అని అల్లు శిరీష్ అన్నారు.

యూట్యూబ్ వ్యూస్ కోసమే

యూట్యూబ్ వ్యూస్ కోసమే

సోషల్ మీడియాలో వార్తలకు నియంత్రణ లేకపోవడం వల్ల అలాంటి రూమర్లు విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. యూట్యూబ్ వ్యూస్ కోసం అలాంటి వార్తలను వైరల్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో వచ్చే వార్తలను నమ్మకూడదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మెగా హీరోలందరి మధ్య మంచి సఖ్యత, రిలేషన్స్ ఉన్నాయి. అందులో ఎలాంటి డౌట్స్ లేవు అని ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌కు మా మద్దతు

పవన్ కల్యాణ్‌కు మా మద్దతు

నాకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. ఆయన స్థాపించిన జనసేన పార్టీకి నా మద్దతు ఎప్పటికీ ఉంటుంది. పవన్ కల్యాణ్ పార్టీకి అల్లు అర్జున్ బహిరంగంగా మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో స్వయంగా పాలకొల్లుకు వెళ్లి పవన్, నాగబాబుతో కలిసి మద్దతు ప్రకటించారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇక ముందు ఉండవు అని అల్లు శిరీష్ స్పష్టం చేశారు.

 ఏబీసీడీపై మిశ్రమ స్పందన

ఏబీసీడీపై మిశ్రమ స్పందన

అల్లు శిరీష్ నటించిన ఏబీసీడీ: అమెరికన్ బార్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే సినిమా మే 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినీ ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్లకుపైగా వసూళ్లను సాధించడం గమనార్హం. మలయాళ చిత్రం ఏబీసీడీ ఆధారంగా రీమేక్ అయింది. ఇందులో రుక్షర్ థిల్లాన్ హీరోయిన్‌‌గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X