రామ్ గోపాల్ వర్మ దొంగల ముఠా గురించి అల్లు శిరీష్ కామెంట్
అల్లు శిరీష్ ఎప్పటికప్పుడు ట్విట్టర్ లో తెలుగు సినిమాపై,మార్కెట్ పై కామెంట్స్,విశ్లేషణలు చేస్తూండటం తెలిసిందే. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రయోగంగా పేర్కొంటున్న దొంగల ముఠా చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...దొంగల ముఠా నాలుగున్నర లోజుల్లో ఫినిష్ అయింది. ఆయన నిజంగా రాక్ స్టార్. రాము..మార్విక్..మార్గదర్శి అంటూ పొగిడాడు. ఇక వర్మ ఎప్పటికప్పుడు చిరంజీవిపై, రామ్ చరణ్ పై కామెంట్స్ చేస్తున్నా అవేమీ దృష్టిలో పెట్టుకోకుండా కేవలం ఆయన గొప్పతనాన్ని మాత్రమే గుర్తించి పొగడటం అల్లు శిరీష్ లో మంచి క్వాలిటీ అనే చెప్పాలంటున్నారు. ఇక దొంగల ముఠా చిత్రం షూటింగ్ ముందు చెప్పినట్లుగా కేవలం ఐదు రోజుల్లో ,కేవలం ఎనిమిది మంది క్రూ మెంబర్స్ తో దిగ్విజయంగా పూర్తయయ్యంది. నాలుగు కెనాన్ కెమెరాలను ఉపయోగించి, ఒకేసారి నాలుగు యాంగిల్స్ లో ప్రతీషాట్ తీయటం వల్ల వేగంగా షూట్ చేయటం సాధ్యపడింది. రవితేజ, ఛార్మి, ప్రకాష్ రాజ్, లక్ష్మి మంచు, బ్రహ్మానందం, సుబ్బరాజు, బ్రహ్మాజి మరియు సుప్రీత్ మొదలగు వారున్న ఈ సినిమాను ఇండస్ట్రీలో మొదటిసారిగా జీరో బడ్జెట్(ఒక్క రూపాయి ఎవరికీ ఇవ్వకుండా)తో నిర్మించటం జరిగింది. మార్చి 4, 2011 న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.


Click it and Unblock the Notifications











