For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బార్లో వంటచేసిన అల్లు హీరో: బారులో చికెన్ వింగ్స్ వండిన హీరో

    |
    బార్ లో చికెన్ వింగ్స్ వండిన అల్లు హీరో

    తండ్రి నుంచి వ్యాపార రంగంలో ఎన్నో మెలకువలు నేర్చుకున్న బన్నీ మొదట రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించాడు . "800 జూబ్లీ" పేరుతో ఇప్పటికే తన ఆధ్వర్యంలో ఓ పబ్‌ను నడుపుతున్నాడు ఈ స్టైలిష్ స్టార్. ఆ తర్వాత 'కానోలీ కేఫ్' అంటూ ఓ స్విస్ బేకరీ కూడా మొదలుపెట్టాడు. తాజాగా వరల్డ్ ఫేమస్ స్పోర్ట్స్ బార్ బఫెల్లో వైల్డ్ వింగ్స్ బి-డబ్స్కి ఫ్రాంచైజీని స్టార్ట్ చేశాడు అల్లు అర్జున్.

     స్పోర్ట్స్ టీమ్ లు కొనుగోలు కూడా

    స్పోర్ట్స్ టీమ్ లు కొనుగోలు కూడా

    ఇక ఇండియాలో ఈ సంస్థకు ఇదే తొలి ఫ్రాంఛైజీ అట.హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో బన్నీ..ఈ ‘బి-డబ్స్'ను ఏర్పాటు చేశాడు. అలాగే స్పోర్ట్స్ టీమ్ లు కొనుగోలు కూడా చేస్తున్నాడు. మెగా ఫ్యామిలీలో మిగతా వారితో పోలిస్తే అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటాడు.

    అభిమానులకు టచ్ లో ఉంటాడు

    అభిమానులకు టచ్ లో ఉంటాడు

    సినిమాకు సంబంధించిన విశేషాలే కాదు... పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటాడు. తాజాగా ఓ వంట చేస్తూ శిరీష్ పోస్ట్ చేసిన ఫొటో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ వంట కంటే అది చేసిన ప్లేసే ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది.

    బారుకొచ్చాడు

    బారుకొచ్చాడు

    సినిమా నటుల్లో ఈమధ్ బిజినెస్‌లపై గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఈ బ్యాచ్ లో స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా తాజాగా తాజాగా హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఓ పోష్ బార్ పెట్టాడు. దాని పేరు బి-డబ్స్. రీసెంట్ గా శిరీష్ ఈ బారుకొచ్చాడు. వచ్చాక తీరిగ్గా కిచెన్ రూంలోకి ఎంటరయ్యి వంటలో తనకున్న ప్రావీణ్యాన్ని ప్రదర్శించాడు.

    చికెన్ వింగ్స్

    చికెన్ వింగ్స్

    చికెన్ వింగ్స్ తయారు చేసి ఇదిగో ఇలా సిద్ధమైందంటూ ఆహార ప్రియుల నోరూరేలా ఓ ఫొటో తీశాడు. దీనిని ట్విట్టర్ లో అభిమానులందరికీ షేర్ చేశాడు. గ్రేట్ ఫుడ్ అంటూ తన వంటకు కితాబు ఇచ్చేసుకుని ఆహార ప్రియులైతే ఈ బార్ ను విజిట్ చేయమంటూ ఓ సలహా కూడా ఇచ్చాడు.

     ఎక్కడికి పోతావు చిన్నవాడా

    ఎక్కడికి పోతావు చిన్నవాడా

    ప్రస్తుతం అల్లు శిరీష్ ఎక్కడికి పోతావు చిన్నవాడా ఫేం డైరెక్టర్ వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో ఒక్క క్షణం సినిమా చేస్తున్నాడు. జెంటిల్ మెన్ - ఎక్స్ ప్రెస్ రాజా సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నార్త్ బ్యూటీ సురభి ఇందులో శిరీష్ కు జంటగా నటిస్తోంది. థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ వచ్చే నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.

    English summary
    Allu Sirish Cooking in Allu Arjun B-Dubs Bar Kitchen
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X