హీరో సూర్య చిత్రం‌లో ఫుల్ లెంగ్త్ పాత్రలో అల్లు శిరీష్‌

By Bojja Kumar

కె.వి ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో హీరో సూర్య 37వ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభ‌కానుంది. ఈ చిత్రంలో తెలుగు హీరో అల్లు శిరీష్ అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రంలో మళయాల నటుడు మోహన్ లాల్ కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. మ‌ల్టిలాంగ్వేజ్ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నారు. వీడొక్క‌డే, బ్ర‌ద‌ర్స్ సినిమాల తర్వాత సూర్య - కె.వి.ఆనంద్ కాంబినేష‌న్ ఈ చిత్రం రూపొందుతోంది.

అల్లు శిరీష్ పాత్ర సూర్య పాత్ర‌తో పాటు ఫుల్ లెంగ్త్ సాగుతుంది. సూర్య సినిమాలో అవకాశం దక్కడంపై శిరీష్ స్పందించారు. ''కొన్ని రొజుల క్రితం డైర‌క్ట‌ర్ ఆనంద్ ని క‌లిశాను. ఆయ‌న చెప్పిన పాత్ర చాలా బాగా న‌చ్చింది. ఎంత‌లా అంటే నా పాత్ర‌కొసం నేను ఇప్ప‌టి నుండే ప్రీపేర్ అవుతున్నాను కూడా.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎక్సైట్‌మెంట్‌గా వుంది.'' అన్నారు.

Allu Sirish Excited To Share Screen Space With Suriya

నేను నా ఇంట‌ర్యూస్ లో నా ఫెవ‌రేట్ హీరో సూర్య అని చెబుతూవుంటాను.. .. అలాంటిది ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌టం.. అందులోనూ ఆయ‌న తో ఫుల్ లెంగ్త్ పాత్ర వుండ‌టం చాలా హ్య‌పిగా, ఎగ్జైట్‌మెంట్ గా ఉందని శిరీష్ తెలిపారు.

ఇక్క‌డ నా ల‌క్ ఎంటంటే మ‌ళ‌యాలం లో డెబ్యూగా చేసిన 1971 చిత్రం లో మెహ‌న్‌లాల్ గారితో చేశాను. ఇప్పుడు ఈ చిత్రంలో మెహ‌న్‌లాల్, సూర్య తో కలిసి చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆనంద్ గారికి నా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను.. గ్రేట్ డైర‌క్ట‌ర్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ ల‌తో త్వ‌ర‌లో వ‌ర్క్ చేయ‌బోతున్నాను అన్నారు .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X