For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    '36-24-36' కి ఎక్సైట్ అవుతున్న అల్లు శిరీష్

    By Srikanya
    |

    హైదరాబాద్: త్వరలో తెలుగు తెరపై మరో దిగుతున్న మరో హీరో అల్లు శిరిష్. మోడ్రన్ లుక్ తో ఉండే అతని ఆలోచనలు మోడ్రన్ టచ్ తో కొద్దిగా సెన్సాఫ్ హ్యూమర్ తో ఉంటున్నాయి. తాజాగా అల్లు శిరీష్... ట్విట్టర్ లో 12-12-12 గురించి ప్రస్దావిస్తూ... ఆ అంకెలు తనను '36-24-36' లా ఎక్సైట్ చేయలేకపోతున్నానని చిలిపి కామెంట్ వదిలారు. అల్లు శిరీష్ ట్విట్స్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉంది. సమకాలీన అంశాలు... తన కుటుంబ విషయాలు, తన సోదరుడు సినీ విశేషాలు అందులో శిరీష్ ప్రస్తావిస్తూ ఉంటారు.

    ప్రస్తుతం అల్లు శిరీష్‌ హీరోగా 'గౌరవం' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని దీపావళి కానుకగా విడుదల చేసారు. అళగియ దీయే, మొళి, అభియుమ్ నానుమ్, పయనం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు రాధామోహన్ తాజాగా రూపకల్పన చేస్తున్న చిత్రం గౌరవం. నటుడు ప్రకాష్‌రాజ్ డ్యూయెట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో రూపొందుతోంది.

    చిత్రం కథ గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ... ఇదో సోషల్ డ్రామా... హ్యూమన్ టచ్ తో కూడి ఉంటుంది. ఓ సిటీ కుర్రాడు... తన స్నేహితుడుని వెతుక్కుంటూ ఓ విలేజ్ కు వెళ్లతాడు. అక్కడ అసలు భారతీయ గ్రామం స్వరూపం చూడటం జరుగుతుంది. అక్కడ జరిగే పరిణామాల సమాహారమే మా చిత్రం అన్నారు.

    ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఆ మధ్య హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్' లోనూ హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తయింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం... ఈ చిత్రంలో మెగా అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి అని దర్శకుడు చెప్తున్నారు. ప్రేమ, సెంటిమెంట్, వినోదం కలిసిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని నవ హీరో అల్లు శిరీష్ అంటున్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయాన్ని ఇస్తుందని అల్లు శిరీష్ ఆశిస్తున్నారు.

    ఈ చిత్రం విశేషాలను ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.

    English summary
    SIRISH ALLU tweeted that...12-12-12 doesn't excite me as much as 34-26-36 does. Allu Sirish, younger brother of Allu Arjun, who is getting ready to make his film debut with 'Gouravam' movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X