అల్లు శిరీష్ సినిమాకు ముహూర్తం ఖరారు!
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి సినిమా రీమక్ లో అల్లు శిరీష్ నటించబోతున్న సంగతి తెలిసిందే. మధుర ఎంటర్టైన్మెంట్ , బిగ్ బెన్ బ్యానర్స్ లో మధుర శ్రీధర్, యష్ రంగినేని ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కన్నడ సంగీత దర్శకుడు జుడా శాండీ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
సంజీవ్ రెడ్డి అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. గతంలో సంజీవ్ రెడ్డి మధుర శ్రీధర్ సినిమాలకు రచయితగా వర్క్ చెయ్యడం జరిగింది. తాజా సమాచారం మేరకు జూన్ 18న సినిమాను ప్రారంభించాలని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది ఈ సినిమా.

అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. మలయాళంలో ఈ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. గతంలో ఈ చిత్రాన్ని తెలుగులో కొంత మంది యువ హీరోలు రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికి చివరికి అల్లు శిరీష్ చేస్తున్నాడు. ఈ సినిమాలో భావోద్వేగాలతో కూడిన సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి.


Click it and Unblock the Notifications











