అల్లు శిరీష్ సినిమాకు ముహూర్తం ఖరారు!
వి.ఐ.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఒక్క క్షణం సినిమా విడుదల తరువాత అల్లు శిరీష్ తన కొత్త సినిమాను ప్రారంభించబోతున్నాడు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ఏబిసిడి సినిమా రీమక్ లో అల్లు శిరీష్ నటించబోతున్నాడు. సంగీత దర్శకుడిగా కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీని ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది.
నూతన దర్శకుడు సంజీవ్‌రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఎల్లుండి (మే 30న ) సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు. జూన్‌నుండి షూటింగ్ మొదలుకానుంది ఈ సినిమా. ఈ చిత్రంలో హీరో అమెరికాలో పుట్టిన ఒక కుర్రాడు ఇండియా వచ్చి బలవంతం మీద ఎలా డిగ్రీ చేస్తాడు అనే పాత్రలో కనిపించబోతున్నాడు.

మధుర శ్రీధర్ ఈ సినిమాను మధుర ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మించబోతున్నాడు. గతంలో ఈ చిత్రాన్ని తెలుగులో కొంత మంది యువ హీరోలు రీమేక్ చేద్దామని అనుకున్నప్పటికి వర్కౌట్ కాలేదు. చివరికి అల్లు శిరీష్ ఈ సినిమా చేస్తే బాగుంటుందని భావించి ఈ సినిమా చెయ్యబోతున్నాడు.
ఈ సినిమాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలతో పాటు మంచి కామెడీ ఉంటుంది. తెలుగులో ఈ చిత్రాన్ని ఎలా తీస్తారో చూడాలి. అల్లు శిరీష్ సరసన రుక్షర్ మీర్ ఈ సినిమాలో నటిస్తోంది. త్వరలో హీరోయిన్ పేరు అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాతో అల్లు శిరీష్ మంచి హిట్ కోడతాదేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











