అల్లు శిరీష్ ‘గౌరవం’ హీరో లుక్
అల్లు శిరీష్ హీరోగా 'గౌరవం'అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఇప్కపటికే విడుదల చేసారు. అయితే అందులో అల్లు శిరీష్ లేడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అల్లు శిరీష్ హీరో లుక్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ గా ఎంపికైంది.
తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్' లోనూ హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం...ఈ చిత్రంలో మెగా అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం విశేషాలను ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications











