Don't Miss!
- News మేషరాశిలో శుక్రుడు.. ఈ రాశులవారికి తీవ్ర అనారోగ్యం.. జాగ్రత్త!!
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
అల్లు శిరీష్‌కు బన్నీ గిఫ్ట్..... అభిమాని అడగటంతో కరిగిపోయాడు!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన ముద్దుల తమ్ముడు శిరీష్‌కు కొత్త యాపిల్ మాక్ ల్యాప్‌టాప్ గిఫ్టుగా ఇచ్చాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శిరీస్ ఓ ట్వీట్ పెట్టాడు. 20 సంవత్సరాల నుండి విండోస్ వాడుతున్నాను. ఇపుడు మాక్ ఓఎస్‌కు మూవ్ అవుతున్నాను. నాకు ఈ గిఫ్ట్ ఇచ్చిన అన్నయ్య అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు. అన్నయ్య నాకు చిన్నతనంలో బెన్క్యూ జాయ్ బుక్ నుండి ఇప్పుడు ఇచ్చిన ల్యాప్ టాప్ వరకు అన్నీ కూడా ఆయన ఇచ్చిన గిఫ్టులే అని శిరీష్ చెప్పుకొచ్చారు.
శిరీష్ పెట్టిన ఈ ట్వీట్ మీద ఓ అభిమాని స్పందిస్తూ.... అన్నా నాకూ ఒక చిన్న ల్యాప్ టాప్ గిఫ్టుగా ఇవ్వొచ్చుకదా. నేను కొనాలి అంటే మరో మూడేళ్లు పడుతుంది. నాకు ఫ్యామిలీ బాధ్యతలు ఎక్కువ. సాలరీ తక్కువ. నా జాబ్‌లో ల్యాప్ టాప్ యూజ్ ఎక్కువగా ఉంటుంది కానీ నాకు ఇప్పటి వరకు ల్యాప్ టాప్ లేదు. నేను మీకు, బన్నీకి పెద్ద అభిమానిని అని ట్వీట్ చేశాడు.
Ayyo.. Dont worry bro, you earn and support your family.. Since I have new laptop, you take my Sony Vaio. Cool? Send me a DM. Cheers. https://t.co/GTKLDWn7I5
— Allu Sirish (@AlluSirish) September 27, 2018
దీనికి అల్లు శిరీష్ స్పందిస్తూ.... నువ్వేం బాధపడుకు తమ్ముడూ... నువ్వు సంపాదిస్తూ నీ ఫ్యామిలీకి సపోర్టుగా ఉండు. నాకు కొత్త ల్యాప్ టాప్ వచ్చింది కాబట్టి నా వద్ద ఉన్న సోనీ ల్యాప్ టాప్ నీకు ఇస్తాను. నీ పూర్తి వివరాలు మెయిల్ చేయ్... అని శిరీష్ సూచించాడు.
అల్లు శిరీష్ సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం 'ఎబిసిడి-అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి' అనే చిత్రంలో నటిస్తున్నాడు.