అల్లు శిరీష్ ‘గౌరవం’ పొల్లాచ్చి
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి వెండి తెరకు పరిచయం అవుతున్న అల్లు శిరీష్ హీరోగా రూపొందుతున్న 'గౌరవం' చిత్రం తొలి షెడ్యూల్ ఇటీవలే మైసూర్, రాజమండ్రి ప్రాంతాల్లో పూర్తి చేసుకుంది. తాజాగా ఈ చిత్రం తర్వాతి షెడూల్ తమిళనాడులోని పొల్లాచ్చి ప్రాంతంలో మొదలైంది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న రాధా మోహన్ ఈ ప్రాంతంలో శిరీష్, ఇతర తారాగణంపై టాకీ పార్టుకు సంబంధించిన సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఇక్కడ షూటింగ్ పూర్తయ్యాక కన్యా కుమారిలో షూటింగ్ జరుగనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఈచిత్రం ఒకే సారి విడుదల చేయనున్నారు. గతంలో రాధా మోహన్ తెలుగులో 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించారు. నటుడు ప్రకాష్ రాజ్ ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ నటిస్తోంది. రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన యామీ గౌతమ్ ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్' లోనూ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే.
మెగా కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన వారంతా హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే శిరీష్ పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకోగలడా? అనేది సందేహంగా మారింది. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications











