అల్లు శిరీష్ ‘గౌరవం’... ఇదే అసలు లుక్!
హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి వెండి తెరకు పరిచయం అవుతున్న హీరో అల్లు శిరీష్. త్వరలో శిరీష్ 'గౌరవం' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. రాధా మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని నటుడు ప్రకాష్ రాజ్ 'ప్రకాష్ రాజ్ ప్రొడక్షన్స్' పతాకంపై నిర్మిస్తున్నారు. తాజాగా ఈచిత్రానికి సంబంధించిన అసలైన ఫస్ట్ లుక్ రిలీజైంది.
తెలుగు, తమిళ భాషల్లో ఈచిత్రం ఒకే సారి విడుదల చేయనున్నారు. మార్చి నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గతంలో రాధా మోహన్ తెలుగులో 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించారు. ఇప్పటికే నిర్మాతగా ప్రకాష్ రాజ్ పలు చిత్రాలు నిర్మించిన అనుభవం ఉంది. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ నటిస్తోంది. రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రం విశేషాలను ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు.
మెగా కుటుంబం నుంచి సినీ రంగంలోకి వచ్చిన వారంతా హీరోలుగా నిలదొక్కుకున్నారు. అయితే శిరీష్ పరిశ్రమలో ఉన్న పోటీని తట్టుకోగలడా? అనేది సందేహంగా మారింది. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications











