తూర్పు గోదావరిలో అల్లు శిరీష్ ఫైట్
''ఆకాశమంత', 'గగనం' లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి రాధామోహన్ పరిచయమే. 'గౌరవం' చిత్రం సున్నితమైన కథాంశంతో రూపుదిద్దుకొంటోంది. వినోదం, భావోద్వేగాల మేళవింపుతో ఉంటుంది. మైసూరు పరిసరాల్లో ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాల్ని చిత్రించారు. ఈ నెలాఖరు వరకూ రాజమండ్రి పరిసర గ్రామాల్లోనే చిత్రీకరణ ఉంటుంద''ని యూనిట్ వర్గాలు తెలిపాయి.
ఈ చిత్రం గురించి అల్లు శిరీష్ మాట్లాడుతూ..గౌరవం పక్కా కమర్షియల్ చిత్రం...ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని రకాల అంశాలు ఉన్నాయి. తెలుగు మరియు,తమిళంలో నేను ఎంట్రీ అవ్వటానికి సరైన కథ ఇదే అన్నారు. అలవాగే ఈ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...డే 1,షెడ్యూల్ 2, రాజమండ్రి,బ్యూటిఫుల్ వెదర్,సీనిక్ బ్యూటీ సూపర్ గా ఉందంటూ ట్వీట్ చేసారు.
అలాగే ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications












