Don't Miss!
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- News భట్టికి షాక్ - పంతం నెగ్గించుకున్న పొంగులేటి..!!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆనందంలో రంగా రంగ రంగస్థలాన పాట పాడుతున్న అల్లువారబ్బాయి.. క్రేజీ డైరెక్టర్ ఇలా!
Recommended Video
టాలీవుడ్ మొత్తం ప్రస్తుతం రంగస్థలం మానియా నెలకొని ఉంది. రంగస్థలం చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిట్టిబాబుగా రాంచరణ్ నటనకు అందరూ బ్రహ్మ రథం పడుతున్నారు. వినికిడి లోపం ఉన్న పాత్రలో రాంచరణ్ ఇరగదీశాడని ప్రశంసలు దక్కుతున్నాయి. సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా చరణ్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ జాబితాలోకి అల్లు వారబ్బాయి శిరీష్, క్రేజీ దర్శకుడు మారుతి చేరారు.
కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్
రాంచరణ్ రంగస్థలం చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ కనబరిచాడని అంటున్నారు. స్టార్ హీరో హోదాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించడం మామూలు విషయం కాదు. కానీ ఆ ఛాలెంజ్ ని చరణ్ అద్భుతంగా స్వీకరించి నెగ్గాడు.
రివ్యూలు అదిరిపోయాయి
తొలి షో నుంచే రంగస్థలం చిత్రానికి యునానిమస్ గా పాజిటివ్ టాక్ మొదలైంది. అందుకు తగ్గట్లుగానే సినీ విమర్శకుల నుంచి రివ్యూలు అదిరిపోయేలా ఉన్నాయి.సినీ ప్రముఖులు సైతం రాంచరణ్ నటనకు ఫిదా అవుతున్నారు.
|
మారుతి రెస్పాన్స్
దర్శకుడు మారుతి రంగస్థలం విజయం పట్ల స్పందించాడు. చిట్టిబాబు పాత్రలో రాంచరణ్ ఇరగదీశాడని ప్రశంసించాడు. సమంత, ఆది పినిశెట్టి నటన అద్భుతంగా ఉందని కొనియాడారు.
|
ఆనందంలో పాటేసుకున్న అల్లువారబ్బాయి
రంగస్థలం చిత్రం విజయం సాధించిన సంతోషంలో అల్లువారబ్బాయి శిరీష్ పాటేసుకున్నాడు. రంగా రంగ రంగస్థలాన అంటూ సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేసాడు. అన్ని ఏరియాల నుంచి రంగస్థలం చిత్రానికి అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయని శిరీష్ అభిప్రాయ పడ్డాడు.