'రక్త చరిత్ర' చిత్రంపై అల్లు శిరీష్ స్పందన ఏంటంటే
రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం రక్త చరిత్రను చూసిన అల్లు శిరీష్ ..ట్విట్టర్ లో తన అనుభూతిని వివరించారు. అల్లు శిరీష్ మాటల్లో...నిన్నే రక్త చరిత్ర చిత్రం చూసాను. నాకు బాగా నచ్చింది. కథ ..లోకల్ నేటివిటీతో హింస, డ్రామాలను నింపుకుని ఉంది. మొత్తానికి రాము తిరిగి ఫామ్ లోకి వచ్చారు. ఇక వివేక్ ఒబరాయ్..ఇట్లాంటి రోల్స్ లో జీవిస్తాడు. అలాగే అందరి ఆర్టిస్టుల్లో అభిమన్యు సింగ్ మొత్తం సినిమాకి హైలెట్ గా నిలిచాడు. శతృఘ్న సింహా మంచి ఛాయిస్, ఆయన పాత్రకు న్యాయం చేసాడు. ఇక సినిమాలో హై పాయింట్ ఏమిటంటే...సూర్య ని క్లైమాక్స్ అయ్యాక పరిచయం చేయటం. పార్ట్ 2 లో అతని కథ ఉంటుందని చెప్పటం. నేను నవంబర్ 18 న పార్ట్ 2 తప్పక చూస్తాను. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాను.అయితే డబ్బింగ్ మరింత బావుండాలి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత నేటివిటీని తీసుకొస్తే బావుంటుంది అన్నారు.
రక్త చరిత్ర అల్లు శిరీష్ సూర్య వివేక్ ఒబరాయ్ రామ్ గోపాల్ వర్మ raktha charitra allu sirish surya vivek oberoi ram gopal varma


Click it and Unblock the Notifications