హీరోల బిరుదలపై అల్లు శిరీష్ కామెంట్
సీరియస్ గా నాకు బిరుదులు ఏమీ వద్దు...నాకు అవటం ఇష్టం లేదు. మిగతా వాళ్ల బిరుదలు గురించి కాదు. అవి బాగున్నాయి అంటూ అల్లు శిరీష్ అన్నారు. అల్లు శిరీష్ కి ఒక్క సినిమా కూడా విడుదల అవకుండానే సుప్రీం స్టార్ అనే బిరుదు ని దర్సకుడు హరీష్ శంకర్ ఇచ్చారు. దానిని అందరూ విమర్శించారు. ఈ నేపద్యంలో అల్లు శిరీష్ ఇలా స్పందించారు.
హరీష్ శంకర్ మెగా ఫ్యామిలీపై తన అభిమానాన్ని చాటుకోవటం కోసం చేసి ట్వీట్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. త్వరగా హీరోగా మారుతున్న అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ ని హరీష్ తన ట్విట్టర్ లో "సుప్రీం స్టార్" అని సంభోదిస్తూ బిరుదు ఇచ్చాడు. ఇంకా ఒక్క సినిమా కూడా రిలీజ్ కాని హీరోని ఇలా పిలవటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఆ ట్వీట్ చూసుకున్న అల్లు శిరీష్ ఆనందంతో హరీష్ కి ధాంక్స్ చెప్పాడు. ఈ వ్యవహారం గమనిస్తున్న తెలుగు పరిశ్రమలోని సీనియర్స్ నవ్వుకుంటున్నారు.
అల్లు శిరీష్ హీరోగా త్వరలో 'గౌరవం'అనే చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన యామి గౌతమ్ హీరోయిన్ గా ఎంపికైంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్'లోనూ హీరోయిన్ గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ జూన్ 18న మైసూర్‌లో మొదలుకానుంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రానికి రాధామోహన్ దర్శకత్వం వహిస్తారు. 'ఆకాశమంత', 'గగనం' చిత్రాలు రూపొందించింది ఆయనే. నటుడు ప్రకాష్ రాజ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. గౌరవం చిత్రాన్ని మొదట నాగచైతన్యతో అనకున్నారు. కథ ఓకే చేసి ఫోటో షూట్ లు సైతం జరిగాయి. కానీ చివరి నిముషంలో ప్రాజెక్టు ఇలా అల్లు శిరీష్ కి చేరింది. బడ్జెట్ బాగా ఎక్కువ అవుతూండటంతో వర్కవుట్ కాదని దాన్ని నాగార్జున రిజెక్టు చేసినట్లు సమాచారం.
ఈ చిత్రం విశేషాలను ప్రకాశ్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.


Click it and Unblock the Notifications











