»   » అల్లుశిరీష్ తో అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్..! ఈ ఫొటోలో ఉన్నది శ్రేయా భూపాలేనా?

అల్లుశిరీష్ తో అఖిల్ మాజీ గర్ల్ ఫ్రెండ్..! ఈ ఫొటోలో ఉన్నది శ్రేయా భూపాలేనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం అఖిల్ మ్యారేజ్ మేటర్. ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ జీవీకే మనవరాలు శ్రేయా భూపాల్ తో అఖిల్ నిశ్చితార్దం జరిగాక వీరి పెళ్ళిపై పలు వార్తలు పుట్టుకొచ్చాయి. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో అఖిల్, శ్రేయా భూపాల్ మ్యారేజ్ ఇటలీలో జరగనుందని చెప్పుకొచ్చారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని అన్నారు. కాని ఏం జరిగిందో ఏమో కాని చివరి నిమిషంలో అఖిల్,శ్రేయా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధల వలన పెళ్లి కి బ్రేక్ పడిందని సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసాయి.

అఖిల్ శ్రేయ భూపాల్

అఖిల్ శ్రేయ భూపాల్

అఖిల్ కంటే శ్రేయ భూపాల్ నాలుగేళ్లు పెద్దది. ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది.ఆ తరువాత వీరికి మనస్పర్థలు రావడం తో బ్రేకప్ చెప్పుకున్నారు. ఈ విషయం పై ఇరుకుటుంబాలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు,కానీ లాభం లేకపోయింది. అఖిల్ మాత్రం తన రెండో మూవీ కి రెడీ అయ్యాడు మరి శ్రేయ ఆమె కూడా పెళ్ళికి రెడీ అయిపోయిందని వార్త వినిపిస్తుంది.

వ్యక్తిగత కారణాలతో

వ్యక్తిగత కారణాలతో

ఓ ఎన్నారై సంబంధాన్ని కుటుంబ సభ్యులు చూపించడం.. శ్రేయా భూపాల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయట. వ్యక్తిగత కారణాలతో విడిపోయిన తర్వాత అటు అక్కినేని ఫ్యామిలీ గానీ, ఇటీ జీవికే ఫ్యామిలీ గాని పెద్దగా స్పందించలేదు. అఖిల్ రెండో సినిమాపై దృష్టిపెట్టగా, శ్రేయా తన ఫ్యాషన్ డిజైనింగ్ పనులతో బిజీగా మారినట్టు తెలిసింది.

ఎన్నారై పెళ్లి సంబంధం

ఎన్నారై పెళ్లి సంబంధం

ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శ్రేయా భూపాల్‌కు ఎన్నారై పెళ్లి సంబంధం చూపించడం ఆ తర్వాత ఆమె మరో మాట మాట్లాడకుండా ఒప్పేసుకోవడం జరిగిందని వార్తలు వచ్చాయి. ఎటూ బ్రేక్ అప్ అన్న విషయం కంఫార్మ్ అయిపోయాక. ఈ విషయాన్ని మీడియాకూడా పెద్దగా పట్టించుకోలేదు.

అల్లు శిరీష్ తో

అల్లు శిరీష్ తో

అయితే ఇప్పుడు లేటెస్ట్ గా కనిపించిన ఫొటో టాలీవుడ్ లో కలకలం రేపుతోంది. అల్లు శిరీష్ తో ఒక పార్టీలో ఫుల్ జోష్ లో ఉన్న శ్రేయా భూపాల్ ఫొటో ఇప్పుడు ఫేస్బుక్ లో కనిపించటం తో. ఈ విశయం పై మళ్ళీ ఫోకస్ పడింది. అయితే ఈ ఫొటోలో ఉన్నది శ్రియానా కాదా అన్నదానిపై ఖచ్చితమైన సమాచారమైతే లేదు గానీ ఫేస్బుక్ పోస్టుల్లో మాత్రం ఆ అమ్మాయి శ్రేయానే అంటూ చర్చ జరుగుతోంది.

ఆ ఫొటో పాతదై ఉండవచ్చు

ఆ ఫొటో పాతదై ఉండవచ్చు

అయినా ఆ ఫొటో పాతదై ఉండవచ్చుకూడా, లేదంటే ఫ్రెండ్స్ పార్టీ లో కూడా అయిఉండవచ్చు... ఏదేమైనా ఇప్పుడీ ఫొటోని మాత్రం బాగానే షేర్ చేసుకుంటూ..కామెంట్ చేస్తున్నారు. సెలబ్రిటీల జీవితాలకి ప్రైవేట్ అంతూ ఉండక పోవచ్చు. కానీ వాళ్ళని జడ్జ్ చేసే హక్కు కూడా మనకు లేదు కదా అంటూ చెప్తున్న వాళ్ళూ ఉన్నారు. మొత్తానికి మళ్ళీ ఒక సారి ఈ ఫొటోవల్ల శ్రేయా భూపాల్ వార్తల్లోకెక్కారు...

English summary
Akkineni Hero Akhil's ex Girl friend Sreya bhupal photo with Allu Sireesh is out Now and it became viral in face book...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu