అల్లు శిరీష్ కొత్త చిత్రం '1971 భారత సరిహద్దు' టీజర్ ఇదిగో
అల్లు శిరీష్ నటించిన తాజా చిత్రం '1971 భారత సరిహద్దు' టీజర్ రిలీజైంది.
హైదరాబాద్ : శ్రీరస్తు శుభమస్తు అంటూ గతేడాది హిట్ కు శ్రీకారం పలికిన అల్లు శిరీష్ ఈ సంవత్సరం మరో ముందడగు వేస్తున్నారు. తన అన్న అల్లు అర్జున్ బాటలోనే ముందుకు వెళ్తూ... మళయాళి మార్కెట్ లోకి ప్రవేశిస్తున్నారు.
1971 బెయాండ్ ద బోర్డర్స్ ('1971 భారత సరిహద్దు' తెలుగులో ) అనే టైటిల్ పై రూపొందిన చిత్రంలో శిరీష్ నటించగా.. ఏప్రిల్ 7న ఈ మూవీ విడుదల కానుంది. మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా.. ఓ వార్ ట్యాంకర్ ఆపరేటర్ గా కనిపించనున్నాడు అల్లు శిరీష్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది యూనిట్. ఈ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.
ప్రతి సమస్యకి యుధ్ధం సమాధానం కాదు. యుధ్ధం లేని ప్రపంచాన్ని చూడాలనుకునే ఓ మేజర్ కథే ఈ '1971 భారత సరిహద్దు' చిత్రం. 1971 వ సంవత్సరంలో పాకిస్తాన్‌కి, భారతదేశానికి మద్య జరిగిన యుధ్ధ నేపద్యంలో ఈ కథాంశం నడుస్తుంది. అంతేకాదు ఆ యుధ్ధం జరిగిన ప్రదేశంలోనే ఈ చిత్రాన్ని చిత్రీకరించటం జరిగింది. రియల్ గా యుధ్ధ ట్యాంకర్స్ ని వాడి షూట్ చేశారు. బోర్డర్ లోని ప్రతి సైనికుడు తమ కర్తవ్యాన్ని దైవంలా భావించి వారి ప్రాణాలను సైతం లెక్కపెట్టకుండా దేశరక్షణ కోసం ఎలా పని చేస్తారనేది ఈ చిత్రంలోని ముఖ్య కథాంశం.
ఈ చిత్రాన్నిమలయాళంలో మంచి చిత్రాల దర్శకుడు, నటుడు అంతకు మించి మాజి భారత సైనికాధికారి మేజర్ రవి దర్శకత్వం వహించారు. మలయాళ సూపర్‌స్టార్ మెహన్‌లాల్ హీరోగా నటించారు. మరో ముఖ్యమైన పాత్రలో అల్లు శిరీష్ నటించారు. ఈ చిత్రం మొదటి లుక్ ని అతి త్వరలో విడుదల చేయనున్నారు. భారతదేశంలో అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రతి భారతీయుడు చూడవలసిన తెలుసుకోవలసిన చిత్రం ఈ 1971 భారత సరిహద్దు..
ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ శ్రీనివాస ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై, పూజా కాత్యాయని నిర్మిస్తున్నారు. మాటలు- ఎం.రాజశేఖర్ రెడ్డి, ఫోటొగ్రఫి- సుజిత్ వాసుదేవ్, ఎడిటర్-సమ్జిత్, ఆర్ట్- పలు.కె.జార్జ్ , బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్- గొపి సుందర్, సంగీతం- సిద్దార్ధ విపిన్, నాజిమ్ అర్షద్, రాహుల్ సుబ్రమణ్యన్, నిర్మాత- పూజా కాత్యాయని, దర్శకత్వం- మేజర్ రవి.


Click it and Unblock the Notifications











