twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎబిసిడి ట్రైలర్: స్వయంకృషిలో చిరంజీవిలా ఫీల్ అవ్వకు.. మెప్పించిన అల్లు శిరీష్!

    |

    Recommended Video

    ABCD - American Born Confused Desi Theatrical Trailer - Allu Sirish - Rukshar

    అల్లు శిరీష్ చివరగా నటించిన చిత్రం ఒక్క క్షణం. ఆ చిత్రం నిరాశపరిచిన తర్వాత శిరీష్ నుంచి మరో సినిమా రాలేదు. కాస్త ఎక్కువగా గ్యాప్ తీసుకున్న శిరీష్ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే మలయాళంలో మంచి విజయం సాధించిన ఎబిసిడి చిత్ర రీమేక్ లో నటించాడు. అమెరికన్ బార్న్ కన్ఫ్యూస్డ్ దేశీ అనేది క్యాప్షన్. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్సార్ దిల్లోన్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించిన మాస్టర్ భరత్ ఈ చిత్రంలో అల్లు శిరీష్ స్నేహితుడిగా నటించాడు. శిరీష్ తండ్రి పాత్రలో నాగబాబు నటించడం విశేషం. తాజాగా ఎబిసిడి ట్రైలర్ ని విడుదల చేశారు.

     ఎన్నారై యువకుడిలా

    ఎన్నారై యువకుడిలా

    అల్లు శిరీష్ ఈ చిత్రంలో విలాసవంతమైన జీవనం గడిపే ఎన్నారై యువకుడిలా కనిపిస్తున్నాడు. అతడిని స్నేహితుడి పాత్రలో మాస్టర్ భరత్ నటిస్తున్నాడు. అమెరికాలో పార్టీలు, పబ్బులతో ఎంజాయ్ చేసే అల్లు శిరీష్ తన పాత్రని పరిచయం చేస్తూ ట్రైలర్ లో వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. అమెరికాలో ఓవర్ వైట్, ఓవర్ బ్లాక్ తప్ప ఇంకేం లేదు. ఇండియాలో అయితే వెరైటీ కలర్స్ అంటూ భరత్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు.

     ఇండియాలో ఇబ్బందులు

    ఇండియాలో ఇబ్బందులు

    అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అల్లు శిరీష్ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమెరికాలో ధనవంతుడిగా స్థిరపడ్డ వ్యక్తిగా నాగబాబు అల్లు శిరీష్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు. వీరి మధ్య జరిగే సంభాషణ చాలా ఫన్నీగా ఉంది. శిరీష్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. వెంటనే డబ్బు కావాలని శిరీష్ నాగబాబుని అడుగుతాడు. 5 వేలు ఇస్తా అని అంటాడు. 5 వేల డాలర్లేనా అని శిరీష్ అడుగుతాడు. దీనికి నాగబాబు.. కాదు 5 వేల ఇండియన్ రూపీస్ మాత్రమే అని అంటాడు.

     హీరోయిన్‌గా రుక్సార్

    హీరోయిన్‌గా రుక్సార్

    అల్లు శిరీష్ కి జోడిగా ఎబిసిడి చిత్రంలో రుక్సార్ దిల్లోన్ నటిస్తోంది.రుక్సార్ తన గ్లామర్ తో ట్రైలర్ లో మెప్పించింది. శిరీష్ కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాడు. ఇక వెన్నెల కిషోర్ కూడా ఎప్పటిలాగే కామెడీతో మెప్పించేలా ఉన్నాడు. అల్లు శిరీష్ ఈ చిత్రంలో ఎక్కువగా హాస్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

    స్వయంకృషిలో చిరంజీవి

    రాజకీయం కూడా మందులాంటిదే.. మొదలు పెడితే ఆపాలనిపించదు. ఓడిపోయి కూడా ఎలా గెలవాలో తెలిసుండాలి లాంటి సీరియస్ డైలాగులు చిత్రంపై ఆసక్తికాని పెంచేవిగా ఉన్నాయి. ఇక ట్రైలర్ చివర్లో అల్లు చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'డాడీ.. నువ్వు స్వయంకృషితో చిరంజీవిలా ఫీల్ అవ్వకు. కష్టాల్లో తోసేస్తే మారిపోతానని అనుకోకు. రిచ్ గానే పుట్టా.. రిచ్ గానే పెరిగాను.. రిచ్ గానే ఉంటాను' అనే ఫన్నీ డైలాగులు బావున్నాయి.

    English summary
    ABCD - American Born Confused Desi Theatrical Trailer released. ABCD is remake of Malayalam movie. Sanjeev Reddy is the director of ABCD. Rukshar Dhillon playing female lead in this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X