Don't Miss!
- News మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా మరింత ఉధృతంగా వైఎస్ జగన్ చివరి విడత ప్రచారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
అల్లు శిరీష్ ‘గౌరవం’రిలీజ్ ఎప్పుడంటే..
ప్రముఖ తెలుగు నిర్మాత అల్లు అరవింద్ రెండవ కొడుకు శిరీష్ హీరోగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్ హీరోయిన్గా నటిస్తోంది. తెలుగులో రవిబాబు దర్శకత్వంలో నువ్విలా చిత్రంలో హీరోయిన్ గా చేసిన ఈమె ఇటీవలే హిందీలో విడుదలై ఘన విజయం సాధించిన 'విక్కీ డోనర్' లోనూ హీరోయిన్గా చేసి అందరి దృష్టిలో పడింది. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 50% పూర్తయింది. ఇది పక్కా కమర్షియల్ చిత్రం...ఈ చిత్రంలో మెగా అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలు ఉండనున్నాయి. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం 70 శాతం పూర్తయింది.
మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేసి అక్టోబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ, సెంటిమెంట్, వినోదం కలిసిన ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం కావడం సంతోషంగా ఉందని నవ హీరో అల్లు శిరీష్ అంటున్నారు. ఈ చిత్రం కచ్చితంగా విజయాన్ని ఇస్తుందని అల్లు శిరీష్ ఆశిస్తున్నారు. ఈ చిత్రం విశేషాలను ప్రకాష్ రాజ్ తెలియజేస్తూ -''డ్యూయట్ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కొన్ని సినిమాలు నిర్మిచిన మా సంస్థలో ఇదొక ప్రతిష్టాత్మక చిత్రం అవుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద సినీ కుటుంబానికి చెందిన శిరీష్‌ని హీరోగా పరిచయం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రకాశ్‌రాజ్, నాజర్, పవిత్రా లోకేష్, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.తమన్, కెమెరా: ప్రీత, కళ: కదీర్.