కామెడీతో కొత్త లవ్ స్టోరీ...(కొత్త జంట ప్రివ్యూ)
హైదరాబాద్: అల్లు శిరీష్,రెజీనా జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం కొత్త జంట. 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్', 'ప్రేమకథా చిత్రమ్' సినిమాతో వరుస హిట్స్ అందుకున్న మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఈ రోజు (మే 1)న గ్రాండ్‌గా విడుదలవుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్న ప్రధాన అంశం కామెడీకి పెద్దపీట వేస్తూ ఈచిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మెగా అభిమానులు కోరుకునే కమర్షియల్ హంగులు కూడా జొప్పించి ఈ సారి అల్లు శిరీష్ ను ఎలాగైనా హీరోగా స్టాండ్ చేయాలనే పట్టుదలతో ఈ చిత్రాన్ని చేసినట్లు తెలుస్తోంది.

సినిమా మొదటి భాగం సప్తగిరి మిమ్మల్ని కడుపుబ్బా నవ్విస్తే, సెకండాఫ్ లో బినామి పాత్ర పొశించిఅన్ పోసాని కృష్ణ మురళి బాగా నవ్విస్తాడు. వీరిద్దరి కామెడీతో పాటు క్లైమాక్స్ లో వచ్చే సెంటిమెంట్ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని సమాచారం. చిరంజీవి నటించిన 'ఖైదీ నెం. 786' చిత్రంలోని 'అటు అమలాపురం...ఇటు పెద్దాపురం' సాంగ్ రీమిక్స్ చేసారు. అదే విధంగా హీరో హీరోయిన్ల మధ్య జరిగే ప్రేమ సన్నివేశాలు మంచి వినోదాన్ని పంచుతాయట. అదే విధంగా ఫ్యామిలీ ప్రేక్షకులు మెప్పే అంశాలు కూడా జొప్పించారు.
నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు.
సంగీతం: జేబి
ఎడిటింగ్: ఉద్ధవ్
ఆర్ట్: రమణ
యాక్షన్: విజయ్
డాన్స్: గణేష్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్
పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను
సమర్పణ: అల్లు అరవింద్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్
నిర్మాత్: బన్నీ వాసు
కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి


Click it and Unblock the Notifications











