అల్లు శిరీష్ అల్లరి మామూలుగా లేదే!!.. ఆ హీరోయిన్‌ను భలే ఆటపట్టించాడు
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది ఎలా ఎందుకు ఫేమస్ అవుతుందో చెప్పలేం. మనదగ్గరే చూసుకుంటే నాది నక్కిలీసు గొలుసు ఎంతగా సెన్సేషన్ అయిందో తెలిసిందే. దుర్గారావు అనే టిక్ టాక్ స్టార్ తనదైన స్టైల్, స్టెప్పులతో ఆ పాటను మరింతగా ఫేమస్ చేస్తే.. అతన్నే కాపీ కొట్టి ఢీ వంటి అతి పెద్ద షోలో పర్ఫామెన్స్ చేశారు. దీంతో ఆ పాట, దుర్గారావు దెబ్బకు ఫేమస్ అయ్యారు. అలాగే ఉత్తరాదిన ఓ ర్యాప్ విపరీతంగా వైరల్ అవుతోంది.

సీరియల్ డైలాగ్..
సాత్ నిభానా సాతియా అనే హిందీ సీరియల్ ఉత్తరాదిన బాగా ఫేమస్. ఆ సీరియల్‌ను కోడలా కోడలా కొడుకు పెళ్లామా అని తెలుగులో డబ్ చేశారు. అందులో అత్త అయిన కోకిలాబెన్ క్యారెక్టర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో ఓ సీన్‌లో అత్త అయిన కోకిలా తన కోడళ్లపై విరుచుకుపడుతుంది. ఆ డైలాగ్‌ను రీమేక్స్, ర్యాప్ కలిపి ఓ కొత్త ఆడియోను క్రియేట్ చేశారు.

ఖాళీ కుక్కర్..
ఖాళీ కుక్కర్‌ను గ్యాస్‌పై పెట్టడంతో అత్త తన ఇద్దరి కోడళ్లపై విరుచుకుపడుతుంది. అలా ఎవరు పెట్టారని, నువ్వా? నేనా? రాశీ (చిన్న కోడలి పాత్ర పేరు)యా? అంటూ కట్టలు తెంచుకున్న కోపంతో ఫైర్ అవుతుంది. అలాంటి సీరియస్ డైలాగ్స్‌ను ర్యాప్ చేసేసి కామెడీ చేసేశారు. ఇక ఈ వీడియో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది.

రాశీఖన్నా ఫోటోపై..
తాజాగా రాశీ ఖన్నా ఓ ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ ఫోటోకు అల్లు వారబ్బాయి.. శిరీష్ సెటైర్ వేశాడు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్టుగా రాశీ ఓ పోజు పెట్టింది. ఇక ఈ ఫోటోకు అల్లు శిరీష్ పెట్టిన కామెంట్ తెగ వైరల్ అవుతోంది. ఎప్పటికప్పుడు అప్డేట్‌గా శిరీష్ ట్రెండ్‌కు తగ్గట్టు సెటైర్ వేశాడు.
Recommended Video

ఎవరు పెట్టారని..
ఖాళీ కుక్కర్‌ను గ్యాస్‌పై ఎవరు పెట్టారు.. అని కోకిలా అన్న డైలాగ్‌ను రాశీ ఖన్నాకు అన్వయిస్తూ.. దాని గురించే ఆలోచిస్తున్నావా? అని సెటైర్ వేశాడు. ఏది ఏమైనా అల్లు వారబ్బాయి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











