అల్లు అర్జున్ ని ఫాలో చేయద్దు..హెచ్చరిస్తున్న అల్లు శిరీష్
అర్జున్ అల్లు నా బ్రదర్ కాదు..అతన్ని ఫాలో చేయద్దు..అతను ఇంకా ట్విట్టర్ లో జాయిన్ కాలేదు అని రిక్వెస్ట్ చేస్తున్నారు అల్లు శిరీష్. ఆయన తాజాగా ట్వీట్ చేస్తూ..నేను నా బ్రదర్ అల్లు అర్జున్ ని ట్విట్టర్ లో చేరమని ఎట్లా అయితేనేం కష్టపడి ఒప్పించాను. త్వరలోనే అంటే మనాలి షూటింగ్ నుంచి రాగానే అతను అప్ డేట్స్ చేయటం ప్రారంభిస్తాడు అన్నారు. అంటే అల్లు అర్జున్ పేరిటి ఓ ఫేక్ ట్విట్టర్ ఎక్కౌంట్ ఒకటి ఓపెన్ అయి అప్ డేట్ అవుతోందన్నమాట. అందుకే హెచ్చరిస్తున్నాడు అల్లు శిరీష్. ఇక ఈ ఫేక్ ఎక్కౌంట్స్ ఈ మధ్య బాగా ఎక్కువయ్యాయి. ఆ మధ్య ప్రముఖ నిర్మాత దిల్ రాజు పేరు మీద ఓ ఫేక్ ఎక్కౌంట్ ఒకటి ట్విట్టర్ లో ఓపెన్ చేసారు. దిల్ రాజుకు అస్సలు సంభందంలేని ఆ ఎక్కౌంట్ లో ఆయన పేరు మీద ఏ విషయాలు చెలామణి అవుతాయో అని భయపడ్డారు. ఇక దగ్గుపాటి రాణా ఈ ఫేక్ ఎక్కౌంట్ విషయాన్ని తన ట్విట్టర్ లో తెలియచేస్తూ...దాన్ని దిల్ రాజు అనుకుని ఫాలో కావద్దని చెప్పారు. ఆ మధ్య త్రిషకు కూడూ ఇలాంటి ఫేక్ ఎక్కౌంట్ సమస్య ఎదురైన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అల్లు అర్జున్ కీ ఈ ఫేక్ ఎక్కౌంట్ బాధ తప్పలేదు.


Click it and Unblock the Notifications











