'సింహా' కలెక్షన్స్ గురించి అల్లు శిరీష్
అల్లు శిరీష్ రీసెంట్ గా బాలకృష్ణ సింహా కలెక్షన్స్ గురించి తన ట్విట్టర్ లో ఇలా రాసారు. సింహా ఓపినింగ్స్ ఫెంటాస్టిక్. మొదటి రోజు గుంటూరు షేర్ 61 లక్షలు రికార్డ్. అదే మగధీర..66 లక్షలు, జల్సా 57 లక్షలు, అదుర్స్ 54 లక్షలు, స్టాలిన్ 47 అని పేర్కొన్నారు. ఇక సింహా చిత్రం మొదటి రోజు మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నమిత, నయనతార, స్నేహా ఉల్లాల్ చేసారు. బాలయ్య..ఈ చిత్రంలో మెడికల్ ప్రొఫిసర్ గా, డాక్టర్ గా ద్విపాత్రాభినయం చేసారు. ప్లాష్ బ్యాక్ లో వచ్చే నరసింహా పాత్ర చాలా మందికి నచ్చుతోంది. ఫైట్స్, పాటలు, డైలాగులు ఇలా అన్ని మసాలాలు కొంచెం గట్టిగానే పడ్డ చిత్రంగా అందరూ దీన్ని అభివర్ణిస్తున్నారు. అలాగే చాలా కాలం తర్వాత బాలకృష్ణకు హిట్ రావటంతో ఆయన అభిమానులు సైతం విపరీతమైన ఆనందంగా ఉన్నారు.
సింహా మగధీర అదుర్స్ జల్సా నమిత నయనతార స్నేహా ఉల్లాల్ అల్లు శిరీష్ namitha nayantara simha allu sirish boyapati srinu jalsa


Click it and Unblock the Notifications