ఓ మై గాడ్.. అల్లు వారి మందు బ్రాండ్‌ను బయటపెట్టిన యువ హీరో.. నెటిజన్లకు ఇలా దొరికేశాడు
టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు వారికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. అయితే ఇటీవల అల్లు శిరీష్ మరో బ్రాండ్ గురించి బయటపెట్టడం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో కొన్నిసార్లు సెలబ్రెటీలు వేసే ట్వీట్స్ ట్రోలింగ్స్ కు గురవుతుంటాయి. ఇక నాన్న పుట్టినరోజు సందర్భంగా అల్లు శిరీష్ వేసిన ఒక ట్వీట్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్
టాలీవుడ్ బెస్ట్ నిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గౌరవం. సినిమాకు ఎంత పెడితే ఎంత తెస్తుంది అనే లెక్కల్లో ఆయన ఆలోచన విధానం ఎవరు ఊహించని విదంగా ఉంటుంది. రూపాయి విలువ తెలిసిన పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్ అని ఒక మంచి బ్రాండ్ సెట్ చేసుకున్నారు.

బన్నీ ఎమోషనల్ విషెస్
ఆదివారం అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో అభిమానులు అలాగే పలువురు సెలబ్రెటీలు విషెస్ అందించారు. అల్లు అర్జున్ కూడా నీ లాంటి తండ్రి నాకుండడం గొప్ప అదృష్టం అంటూ ఎమోషనల్ ట్వీట్ వేయడం అభిమానులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. బన్నీకి తండ్రి అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో స్పీచ్ ల తోనే అభిమానులకు అర్ధమయ్యింది.
'అల్లుడు అదుర్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్: స్టైలిష్ లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)

అల్లు శిరీష్ స్పెషల్ కేక్
ఇక అల్లు శిరీష్ కూడా తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. సినిమాటిక్ లుక్ లో అల్లు అరవింద్ కెరీర్ కు తగ్గట్లుగా కేక్ ను రెడీ చేయించారు. షూటింగ్ క్లాప్ బోర్డ్, అలాగే ఆయన నిర్మించిన బెస్ట్ మూవీస్ పోస్టార్స్, ఆహా యాప్, గీత ఆర్ట్స్ లోగోలు కూడా కనిపించేలా మంచి కేక్ ను రెడీ చేయించాడు.

మందు బ్రాండ్ ఇదే అంటూ..
అంతా బాగానే ఉంది కానీ ఒక్క విషయంపై నెటిజన్లు పదే పదే సరదాగా ట్వీట్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఆ కేక్ పక్కనే ఒక ఫుల్ బాటిల్ కూడా సెట్ చేసిన అల్లు శిరీష్ కానుకగా ఇచ్చినట్లు అర్ధమయ్యింది. అంటే అల్లు అరవింద్ గారి బ్రాండ్ అదేనన్నమాట అంటూ నెటిజన్లు కామెంట్ బాక్స్ ను నింపేస్తున్నారు. మరి ఆ కామెంట్స్ కు శిరీష్ ఏ విధంగా స్పందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











