ఎంజాయ్ చేస్తూ చేశా.. ఇంతమంచి రెస్పాన్స్ ఎప్పుడూ రాలేదు.. మెగా హీరో ఏమంటున్నాడో చూడండి

ఇప్పటి వరకూ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలంతా ఏదో సినిమాతో టర్న్ తీసుకున్నారు. అయితే మెగా నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్ కి మాత్రం కెరీర్ లో సరైన బ్రేక్ రాలేదనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఎలాగైనా తన టాలెంట్ నిరూపించి, కెరీర్ గాడిలో వేసుకోవాలని ఏబీసీడీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వైవిధ్య భరితమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి అన్ని షోలకు హౌస్‌ఫుల్ కలెక్షన్స్ తేవడంతో చిత్రయూనిట్ సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకుంది.

మిక్స్‌డ్ టాక్

మిక్స్‌డ్ టాక్

తొలిరోజు క్రిటిక్స్ నుంచి యావరేజ్ రేటింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ టాక్ రాబట్టింది. చిత్రంలో ఫస్టాఫ్ హైలైట్ గా ఉందని, ఇదో కామెడీ ఎంటర్ టైనర్ సినిమా అని, అల్లు శిరీష్ కెరీర్ లో బెస్ట్ మూవీ అని రకరకాలుగా చెప్పుకుంటోంది ప్రేక్షకలోకం. చిత్రంలో హీరో, హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ స్టోరీకి అదేవిధంగా భ‌ర‌త్, వెన్నెల‌ కిషోర్ కామెడీకి మంచి మార్కులు పడ్డాయి.

సక్సెస్ సెలెబ్రేషన్స్

సక్సెస్ సెలెబ్రేషన్స్

ఈ నేపథ్యంలో శుక్రవారం యూనిట్ సభ్యులు కేక్ కట్ చేసి సక్సెస్ సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. మొదటి రోజే చిత్రానికి వస్తున్న టాక్ పట్ల ఆనందం వ్యక్తం చేశారు యూనిట్ సభ్యులంతా. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు హీరో అల్లు శిరీష్ పాల్గొన్నారు.

ఎంజాయ్ చేస్తూ చేశా

ఎంజాయ్ చేస్తూ చేశా

ఈ సందర్బంగా తన ఫీలింగ్స్ పంచుకున్న అల్లు శిరీష్.. ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నానని చెప్పాడు. ''ఏబీసీడీకి నా కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్ వ‌చ్చాయి. కొత్త జంట‌, శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు సినిమాల‌ కంటే బెట‌ర్‌గా ఓపెన్ అయ్యింది. ప‌ర్స‌న‌ల్‌గా ఆర్టిస్ట్‌గా ఎదిగిన ఫీలింగ్ కలుగుతోంది. ప్ర‌తి షోకు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ వ‌స్తున్నాయి. మ‌ధురగారు కోరుకున్న‌ట్లు శ్రీర‌స్థు శుభ‌మ‌స్తు సినిమా క‌లెక్ష‌న్స్‌ను దాటాల‌ని కోరుకుంటున్నాను. ఇప్ప‌టి వ‌ర‌కు నా సినిమాకు ఇంత మంచి రెస్పాన్స్ ఏ సినిమాకు రాలేదు. ఈ స‌మ్మ‌ర్‌లో ఫ్యామిలీస్‌ను ఎంట‌ర్‌టైన్ చేసేందుకు మీ ముందుకొచ్చాము'' అన్నారు.

ఏబీసీడీ

ఏబీసీడీ

సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత డి.సురేష్‌ బాబు సమర్పణలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందిన‌ ఎంటర్‌టైనర్‌ మూవీ 'ఏబీసీడీ'. 'అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి' అనేది ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మాతలుగా వ్యవహరించారు. అల్లు శిరీష్, రుక్సాన్ థిల్లాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. భ‌ర‌త్, వెన్నెల‌ కిషోర్ కీలక పాత్రలు పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X