బాహుబలి...రివ్యూలు అస్సలు చదవొద్దు!
హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి-ది బిగినింగ్' నేడు గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సినిమా చూసిన నటుడు అల్లు శిరీష్ సినిమా అద్భుతంగా ఉందని చెప్పుకొచ్చాడు. భారతీయ సినీ చరిత్రలో గొప్ప సినిమాగా పేర్కొన్నాడు. ఇలాంటి సినిమా మన తెలుగులో వచ్చినందుకు గర్వపడుతున్నట్లు తెలిపాడు.

బాహుబలి సినిమా గురించి చెప్పాలంటే ఇక్కడ నేను 10 నుండి 15 ట్వీట్స్ చేయాలి. రివ్యూలు అస్సలు చదవొద్దు. అందులో ఏమీ లేదు. అన్ని మరిచిపోండి. నేరుగా వెళ్లి బాహుబలి సినిమా చూడండి అంటూ అల్లు శీరీష్ ట్వీట్ చేసారు.


Click it and Unblock the Notifications











