మహేష్ తో డీల్ గురించే అల్లు శిరీష్ ట్వీట్
అల్లు శిరీష్ మరో సారి తన ట్వీట్ తో అందరిలో ఆసక్తిని రేపాడు. తాజాగా ట్వీట్ చేస్తూ...కొన్ని ఫాల్స్ న్యూస్ లు గీతా ఆర్ట్స్ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద వినపడుతున్నాయి. మేము కార్పోరేట్ సంస్ధ కాదు..డీల్స్ ..కాంట్రాక్టులు ఇవ్వటానికి అన్నారు. ఇది చదివిన వాళ్లు ఏమిటి గీతా ఆర్ట్స్ మీద వచ్చిన న్యూస్ అని చూస్తే...మహేష్ బాబు తో గీతా ఆర్ట్స్ 45 కోట్ల ప్యాకేజీ ఆఫర్ చేసిందనేది. ఆ ప్యాకేజీ ద్వారా మహేష్ కంటిన్యూగా గీతా ఆర్ట్స్ కు మూడు సినిమాలు చేయాలని. అయితే ఇది అబద్దమని తేల్చేసాడు అల్లు శిరీష్.
ఇక అల్లు శిరీష్ విషయానికి వస్తే ఆయన తన తమిళ ఎంట్రీ కోసం ప్రిపేర్ అవుతున్నట్లు సమాచారం. తెలుగులో హిట్టైన హండ్రెడ్ పర్శంట్ లవ్ చిత్రాన్ని తమిళంలో చేసి పరిచయమవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. ఇక మహేష్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం చేస్తున్నారు. అలాగే సుకుమార్ దర్సకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. ఓ ధ్రిల్లర్ గా రూపొందే ఆ చిత్రంలో హీరోయిన్ గా బెంగుళూరు మోడల్ ని ఎంపిక చేసే అవకాశముందని వినికిడి.


Click it and Unblock the Notifications











