రామ్ చరణ్ మగతనం అంటూ అల్లు శిరీష్ ట్వీట్
రామ్ చరణ్ తాజాగా తన రచ్చ చిత్రం గురించి ట్వీట్ చేస్తూ...నాకు తెలుసు నేను నా కో స్టార్ తమన్నా అంత అందగాడ్ని కాదని...మా కెమెరామెన్ సమీర్ రెడ్డి నన్ను బాగా ఎలివేట్ చేసారు. ధాంక్యూ సమీర్ అంటూ ట్వీట్ చేసారు. దానికి రెస్పాండ్ గా అల్లు శిరీర్ ట్విట్టర్ లో ...మగాడికి అందంతో పని ఏమిటి బ్రదర్...మగతనం,కసి,మంచితనం,సత్త...అన్నీ నీకు బోలెడు...అవి చాలు అంటూ ట్వీట్ చేసాడు. చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ చేసిన ఈ ట్వీట్ చరణ్ అభిమానలును చాలా ఆనందపరిచంది.
ఇక అల్లు శిరీష్ ప్రస్తుతం ఏక్టింగ్ ట్రైనింగ్ లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే తమిళంలో లాంచ్ అవ్వబోతున్నట్లు చెప్తున్నారు. అందుకోసమే డైలాగు డిక్షన్,యాక్టింగ్ ఎబిలిటీస్ కోసం శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. మిస్టర్ ఫెరఫెక్ట్ గానీ,100 పర్శంట్ లవ్ చిత్రం గానీ తమిళంకి రీమేక్ చేస్తూ నటించనున్నట్లుగా చెప్తున్నారు. ఇక రామ్ చరణ్ రచ్చ త్వరలోనే విడుదల కానుంది. తమన్నా హీరోయిన్ గా చేసిన ఆ చిత్రాన్ని సంపత్ నంది డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications