»   » అప్పుడప్పుడూ అమ్మాయిల్ని కూడా చూడు : రానా కి సలహా

అప్పుడప్పుడూ అమ్మాయిల్ని కూడా చూడు : రానా కి సలహా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' చిత్రంలో భల్లాలదేవ పాత్ర కోసం జిమ్‌లో కష్టపడి మనిషివి బాగా రాటుదేలిపోయినట్లున్నావ్‌, కాస్త అప్పుడప్పుడూ పువ్వుల్నీ.. అమ్మాయిల్ని కూడా చూడు అంటూ సరదగా వ్యాఖ్యానించాడు అల్లు శిరీష్‌.

దర్శకుడు రాజమౌళితో సంభాషిస్తున్న ఓ ఫొటోని రానా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ.. దీనికి సరైన వ్యాఖ్య రాయండి అని కోరారు. దీనిపై స్పందించిన శిరీష్‌ పై విధంగా స్పందించాడు. దీనిపై రానా మాత్రం స్పందించకుండా నవ్వి వూరుకున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇండియాస్ బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ ‘బాహుబలి'. తెలుగుతో పాటు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ సంచలన చిత్రంగా నిలిచింది. రూ. 600 కోట్లకుపైగా వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.

Allu Sirish tweet about Rana

గత కొద్ది రోజులుగా ఈ చిత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కు వెళ్తోంది. అందులో భాగంగా తైవాన్ లో జరగనున్న ఫెస్టివల్ కు ఈ చిత్రాన్ని పంపుతున్నారు. ఈ విషయాన్ని బాహుబలి టీమ్ సోషల్ మీడియా తెలియచేసారు.

విడుదలవడమే భారీగా విడుదలైన ఈచిత్రం 50 రోజుల పాటు విజయవంతంగా ప్రదర్శితం అయి కలెక్షన్ల సునీమీ సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా బిజినెస్ దాదాపుగా క్లోజ్ అయింది. దర్శకుడు రాజమౌళి కూడా రికార్డుల కోసం సినిమాను ఎక్కువ రోజులు నడిపించాలనే ఉద్దేశ్యం తమకు లేదని, కలెక్షన్లు వచ్చే కొన్ని చోట్ల మాత్రమే ప్రదర్శిస్తామని గతంలోనే ప్రకటించారు.

తెలుగులో ‘బాహుబలి' మూవీ బిజినెస్ పూర్తవడంతో కలెక్షన్ వివరాలు బయటకు వచ్చాయి. ఒక తెలుగు వెర్షన్ చిత్రమే రూ. 172 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. తెలుగులో సినిమా చరిత్రలో ఈ రేంజిని అందుకునే సత్తా త్వరలో రాబోయే ‘బాహుబలి-2' సినిమాకు తప్ప మరే సినిమాకు లేదని చెప్పడంలో సందహం లేదు.

English summary
Allu Sirish tweeted "Bhalla, workoutlu gatra chesi baga violent aipoyav. Appudappudu kasta puvvulni ammailni kuda chudu!"
Please Wait while comments are loading...