ప్రతి తెలుగువాడు గర్వించదగ్గ సినిమా: అల్లు శిరిష్..!?
భక్తిరస చిత్రంలో ఎంతటి పెద్ద నటుడున్నా కానీ అది విడుదల చేయడానికి నిర్మాత పాట్లు పడక తప్పదని శ్రీరామ రాజ్యం నిరూపిస్తోంది. మాస్ సినిమాల నడుమ ఈ చిత్రాన్ని విడుదల చేసే రిస్క్ చేయలేక నవంబర్ లో విడుదల చేయాలని నిర్మాత దసరా, దీపావళి పండగలని కూడా వదిలేసుకున్నాడు. తీరా ఇప్పుడు నవంబర్ లోనూ ఈ చిత్రానికి పోటీ తప్పేటట్టు లేదు. ఎటు చూసినా కానీ ఆకర్షణీయమైన సినిమాలు చుట్టుముట్టేయడంతో శ్రీరామరాజ్యం" వాటి తాకిడికి ఎలా తట్టుకుంటుందోననే అనుమానాలు రేకెత్తుతున్నాయి.
బాలకృష్ణ రాముడుగా, నయనతార సీతగా బాపు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శ్రీరామరాజ్యం. యలమంచి సాయిబాబు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీరామరాజ్యం చిత్రంపై మైథలాజికల్ అండ్ డివోషనల్ ఫిలిమ్స్ ఇష్టపడే వాళ్లకు భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో మహానటుడు డా అక్కినేని నాగేశ్వరరావు వాల్మీకి పాత్రపోషించడం విశేషం. లక్ష్మణుడుగా శ్రీకాంత్, భరతుడుగా సాయికుమార్ నటించారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో రూపొందిన శ్రీరామరాజ్యం పాటలకు మంచి స్పందన లభిస్తోంది. బాలకృష్ణ, బాపుల కలయికలో రూపొందిన శ్రీరామరాజ్యం చిత్రాన్ని నవంబర్ 10న రిలీజ్ చేయలనుకున్నారు, కాని పోస్ట్ ప్రొడక్షన్ డిలే వలన ఆ డేట్ కు చేయలేకపోతున్నారు. రిలీజ్ డేట్ తెలియవలసి వుంది.
శ్రీరామ రాజ్యం ఆడియో విడదులై చాలా రోజులైనా ఇప్పుడు దాకా పాటలు వినని అల్లుశిరీష్, ఇప్పుడే పాటలు విన్నానని, అవి బాగా నచ్చాయని, సినిమా కోసం ఎదురుచుస్తున్నట్టుగా ట్వీట్ చేసారు. శ్రీరామరాజ్యం లాంటి మైథలాజికల్ అండ్ డివోషనల్ ఫిలిమ్స్ ఒక్క తెలుగులోనే నిర్మిస్తున్నారని, ప్రతి తెలుగువాడు గర్వించ వలసింది అని కూడా అన్నారు.


Click it and Unblock the Notifications











