తెలుగు ప్రజలకు నా క్షమాపణలు: అల్లు శిరీష్
తెలుగు ప్రజలకు నా క్షమాపణలు..ఒక వీక్ మా పబ్లిసిటీ తో విసికించేస్తాం..విముక్తి కావాలంటే దయచేసి సినిమా ఒక సారి చూసెయ్యండి.. అంటూ ట్వీట్ చేసాడు అల్లు శిరీష్. ఆయన తన గీతా ఆర్ట్స్ బ్యా నర్ పై రూపొందించిన 100% లవ్ పబ్లిసిటీ గురించి మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చాడు.అన్ని ఛానెల్స్ లోనూ ఈ చిత్రం గురించి కంటిన్యూగా పోగ్రామ్ లు ప్లాన్ చేసారు. వాటిని ఉద్దేశించి అల్లు శిరీష్ ఇలా అన్నారు.సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 100% లవ్ చిత్రం మొన్న శుక్రవారం విడుదలై హిట్ టాక్తెచ్చుకుంది.
తమన్నా,నాగచైతన్య ఈ చిత్రంలో పెయిర్ గా చేసారు.ఆర్య 2,జగడం చిత్రాలు ప్లాప్ తర్వాత సుకుమార్ రూపొందించిన ఈ చిత్రం విజయం సాధించటంతో అంతా హ్యాపీగా ఉన్నారు.అలాగే అల్లు అర్జున్,తమన్నా కాంబినేషన్ లో రూపొందిన బద్రీనాధ్ చిత్రం ఆడియో నిన్న(శనివారం) రాత్రి విడుదైంది. వి వి వినాయిక్ దర్శకత్వంలో రూపొందిన బద్రీనాధ్ ప్రోమోలుతో పబ్లిసిటీ కూడా ప్రారంభించారు.


Click it and Unblock the Notifications











