అదంతా రామ్ గోపాల్ వర్మ మిస్ లీడ్...అల్లు శిరీష్
నేను అనుకోవటం ఇదంతా రామ్ గోపాల్ వర్మ మిస్ లీడ్ చేయటానికి ఆడుతున్న ప్లే..అంటున్నారు అల్లు శిరీష్ తాజాగా ట్విట్టర్. రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం ...అప్పలరాజులో డైరక్టర్స్ అందరికీ చురకలేస్తూ విడుదల చేసిన పాటపై స్పందిస్తూ చెప్పుకొచ్చారు. అల్లు శిరీష్ మాటల్లోనే...నాకు కథ తెలియకపోయినా...అదంత ఈజీ కాదు..సినిమా చివరలో రామ్ గోపాల్ వర్మ ఓ స్ట్రాంగ్ మెసేజ్ ఇస్తాడు. అలాగే జనం అంతా ఆ పాట విని తెలుగు ఫిల్మ్ డైరక్టర్స్ మీద సెటైర్ పాట అనుకుంటున్నారు. అయితే అది అప్పలరాజు మీద జోక్ అనుకుంటున్నాను. అలాగే అలాగే చిన్న టౌన్ నుంచి వచ్చిన అప్పలరాజు..డైరక్టర్ అవటం చాలా ఈజీ అనుకుంటాడు. అందుకునే ఈ పాట ఎత్తుకుంటాడు. కానీ చివరలో తాను ఓ ఫూల్ నని..డైరక్టర్ అవటం అంత ఈజీ కాదని రియలైజ్ అవుతాడు. అంతేగాక సక్సెస్ ఫుల్ వ్యక్తులకు గౌరవం ఇవ్వాలని తెలుసుకుంటాడు అని ట్వీట్ చేసారు. అప్పలరాజు సినిమాలో ఈ క్లైమాక్స్ ఉంటుందో లేదో తెలియాలంటే జనవరి 12 దాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











