పవన్ ని అడ్డం పెట్టి మహేష్ పై అల్లు శిరీష్
'మగధీర' ను ఈ సినిమా కొట్టలేదు, కొట్టలేదు అని గర్వ పడ్డా...గర్వంగా చెప్తున్నా అలాంటిదేమున్నా ఉంటే అది పవర్ స్టార్ పంజానే అంటూ అల్లు శిరిష్ తాజాగా ట్వీట్ చేసారు. ఆయన ట్వీట్ దేనిగురించి అనేది అందరికి అర్దమైన విషయమే.రీసెంట్ గా మహేష్ తన ట్విట్టర్ లో రాస్తూ.. ఇది అపీషయల్.. దూకుడు తెలుగు ఇండస్ట్రీలో హైయిస్ట్ గ్రాసర్. .అన్ బిలీవబుల్ అని ట్వీట్ చేసారు. ఈ విషయం అంతటా చర్చనీయాంశమైంది. ఈ విషయమై డైరక్ట్ గా చెప్పకపోయనా పంజాని అడ్డం పెట్టుకుని అల్లు శిరీష్ ఇలా మహేష్ ట్వీట్ కి కౌంటర్ ఇచ్చారంటున్నారు. అలాగే పంజా టీజర్ గురించి మట్లాడుతూ.. ఇప్పుడే ఆ టీజర్ చూసా.. నా మైండ్ లో ఉన్న మాట ఏంటంటే... చూడ్డానికి సింపుల్ గా ఉంటాడే కానీ, ఫామ్ లోకి వస్తే దీనమ్మ బాక్సాఫీస్ షేక్ అవుద్ది అంటూ ట్వీట్ చేసారు. ఇక "దూకుడు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నాం. కానీ ఈ స్థాయిని మాత్రం ఊహించలేదు. కథ వినగానే మహేష్ 'ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్' అని అన్నారు. మహేష్‌ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా తెరమీద ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నప్పుడు నా కళ్ళ ముందు తెల్లటి చొక్కా, పులిగోరు చెయిన్‌తో మహేష్ ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించాడు. దాన్నే తెరమీద చూపించాం.
ఇంకో రోజు ట్రెడ్‌మిల్ చేస్తుంటే 'దూకుడు' అనే టైటిల్ స్ఫురించింది. ఇందులోని ప్రతి సీనూ, ప్రతి డైలాగూ మహేష్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినవే అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల. మహేష్, సమంత నటించిన 'దూకుడు' ఇటీవల విడుదలై పరిశ్రమ రికార్డుల్ని బద్ధలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం విదితమే. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే "దూకుడు పెద్ద విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిని నిలబెట్టుకోవాలనే టెన్షన్ కూడా ఉంది'' అని అంటున్నారు శ్రీనువైట్ల. ఇక దూకుడు కలెక్షన్స్ అన్ని భాషల వారిని ఆశ్చర్యపరుస్తున్నారు. మరో ప్రక్క మిగతా హీరోలు సైతం కామిడీ సినిమాలు అంటేనే ఆసక్తి చూపుతూ వాటిమీదే కాన్సర్టేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











